దాసరి మెమోరియల్ ఫిల్మ్ అవార్డ్స్ విజేతలు..

235
Dasari Narayana Rao
- Advertisement -

భీమవరం టాకీస్- భారత్ ఆర్ట్స్ అకాడమి సంయుక్తంగా ‘దాసరి మెమోరియల్ ఫిల్మ్ అవార్డ్స్-2019’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మే 1వ తేదీన ప్రసాద్ లాబ్స్ సాయంత్రం 6 గం.ల నుంచి జరిగే ఈ కార్యక్రమంలో పలు రంగాలకు చెందిన అతిరధ మహారధులు ముఖ్య అతిధులుగా హాజరు కానున్నారు.

అవార్డు విజేతలు వీరే..

దాసరి జీవిత సాఫల్య అవార్డు ఆర్.నారాయణ మూర్తికి, దాసరి ఎక్స్ లెన్సీ అవార్డ్ పూరి జగన్నాథ్ కి.. దాసరి పద్మ & దాసరి నారాయణరావు అవార్డ్ శ్రీ & శ్రీ మతి జీవిత రాజశేఖర్ లకు దాసరి యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ అవార్డ్స్ కోసం మహా వెంకటేష్, వేణు ఊడుగుల.. తిక్క శశి కిరణ్ లను ఎంపిక చేశారు. ఇవి కాకుండా 24 క్రాఫ్ట్స్ లో మరియు ఫిలిం మీడియాలో ప్రతిభావంతులకు కూడా అవార్డ్స్ ఇవ్వనున్నారు.

- Advertisement -