తెలుగు బుల్లితెర చరిత్రలో ప్రతిష్టాత్మకంగా ప్రసారమవుతున్న షో బిగ్ బాస్.. అత్యంత ప్రేక్షకాదరణతో ఈ షో టాప్ రేటింగ్స్‌లో దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ విజయవంతంగా ప్రసారమవుతూ 80వ ఎపిసోడ్ పూర్తి చేసుకుంది. ఎలిమినేషన్స్ ,గొడవలు, టాస్క్‌లతో ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తూ ఎపిసోడ్ ఎపిసోడ్‌కు ట్విస్ట్ ల మీద ట్విస్ట్‌లతో ఆసక్తిగా సాగుతున్న ఈ షోలో తాజాగా మర్డర్ మిస్టరీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. తాజాగా బిగ్ బాస్ హౌజ్‌లో బిగ్ బాస్ విధించిన మర్డర్ మిస్టరీ టాస్క్ లో గీతామాధురి హంతకురాలిగా, గణేష్ మర్డర్ మిస్టరీని పసిగట్టే డిటెక్టివ్ పాత్ర చేయగా, రోల్ రైడా పోలీస్ ఆఫీసర్ పాత్ర చేశాడు. మిగిలిన సభ్యులు పబ్లిక్ గా, మృతులుగా ఉన్నారు. మంగళవారం నాటి ఎపిసోడ్‌లో హంతకురాలు గీతామాధురి చేతిలో కౌశల్, శ్యామలలు చనిపోయారు. బుధవారం నాడు ప్రసారమైన ఎపిసోడ్‌లో అమిత్, సామ్రాలు, దీప్తిలు చనిపోయారు.
అయితే ఈ బిగ్ బాస్ హౌజ్‌లో హత్యల మిస్టరీ ఏంటి.. హత్యలు ఎవరూ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అన్న కోణంలో విచారిస్తూ డిటెక్టివ్, పోలీస్ ఆఫీసర్ ఈ హత్యల మిస్టరీని చేధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కానీ ఫలితం దక్కలేదు. అయితే ఈ టాస్క్‌లో 81 వ ఎపిసోడ్ లో ముందుగా అమిత్ చనిపోయినట్టు బిగ్ బాస్ ప్రకటించాడు. ఆ తర్వాత సామ్రాట్ చనిపోయాడని బిగ్ బాస్ ప్రకటించాడు. అయితే హౌజ్ మేట్స్‌లో హత్యలు చేస్తోంది ముందుగా తనీష్, దీప్తి, గీతామాధురిలలో ఎవరో ఒకరని అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఇంతలోనే హత్యారోపణలు ఎదుర్కొంటున్న దీప్తి కూడా చనిపోవడంతో హత్యలు చేస్తోంది ఎవరనే విషయంపై హౌజ్ మేట్స్ సీరియస్‌గా చర్చలు జరిపారు.
చివరికి బిగ్ బాస్ హౌజ్‌లో గీతామాధురి, తనీష్‌లలో ఎవరో ఒకరు హత్యలు చేస్తున్నారనే నిర్ధారణకు వచ్చారు. చివరికి హౌజ్ మేట్స్ గీతామాధురినే హత్యలు చేస్తుందని నిర్ధారించారు. అయితే తాను హత్యలు చేయడంలేదని గీతామాధురి ఒప్పుకోవడం లేదు. మొత్తానికి గీతామాధురి బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌లను పూర్తి చేసింది. అయితే తదుపరి ప్రసారమయ్యే బిగ్ బాస్ ఎపిసోడ్స్‌లో ఎవరూ ఎలిమినేట్ అవుతారన్న దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. బిగ్ బాస్ 2 లో ఇంకా 20 ఎపిసోడ్స్ మిగిలి ఉండడంతో ఈ సీజన్‌లో విజేతగా ఎవరు నిలుస్తారన్న దానిపై ఇప్పుడు జోరుగా చర్చ జరగుతోంది.