- Advertisement -
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడుతుంది. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల ప్రచారం జరుగుతున్న గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్, జడ్చర్ల, కొత్తూరు, సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్ మున్సిపాలిటిలతోపాటు లింగోజిగూడ సహా ఇతర ప్రాంతాల్లో ఉపఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ నెల 30న ఎన్నికల పోలింగ్ జరుగనుంది. కరోనా నేపథ్యంలో 72 గంటల ముందే అంటే మూడు రోజుల ముందే ప్రచారం ముగించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
- Advertisement -