‘వకీల్ సాబ్’ మరోసారి..!

162
Vakil Saab
- Advertisement -

దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.. లేట్ అయినా లేటెస్ట్‌గా అన్నట్లు బాక్సాఫీస్ బరిలో రికార్డ్స్ క్రియేట్ చేశారు. బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్నారు. కాగా, పవన్ కల్యాణ్ తో సినిమాను నిర్మించాలనే తన కోరిక నెరవేరడానికి 22 ఏళ్లు పట్టిందని ఇటీవల ఒక వేదికపై దిల్ రాజు అన్నారు. ఆయనతో చేసిన ‘వకీల్ సాబ్’ ఘన విజయాన్ని సాధించడం తన జీవితంలో మరిచిపోలేని సంఘటనల్లో ఒకటి అని చెప్పారు.

ఆ వెంటనే పవన్ కల్యాణ్ కూడా .. దిల్ రాజు నిర్మాణంలో సినిమా చేయడం తన అదృష్టమని తన వ్యక్తిత్వాన్ని చాటుకున్నారు. అలా ఆ ఇద్దరి మధ్య ఈ సినిమాతో మరింత సాన్నిహిత్యం పెరిగింది. దాంతో దిల్ రాజు బ్యానర్ పై మరో సినిమా చేయడానికి పవన్ కల్యాణ్ అంగీకరించారు. ఈనేపథ్యంలో పవన్ తో దిల్ రాజు మరో సినిమా చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అడ్వాన్స్ కూడా పవన్ కు చేరిందనే టాక్ వచ్చింది.

అయితే ఈ సినిమా కోసం మంచి కథను రెడీ చేయమని ఇద్దరు ముగ్గురు దర్శకులతో దిల్ రాజు చెప్పారట. అందులో ‘వకీల్ సాబ్’ దర్శకుడు వేణు శ్రీరామ్ కూడా ఉన్నాడు. పవన్ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందనే విషయం వేణు శ్రీరామ్ పట్టేశాడు. అందువలన అందుకు తగిన కథను సిద్ధం చేసే పనిలో పడ్డాడట. పవన్ ను ఒప్పించేలా కథపై గట్టిగానే కసరత్తు చేస్తున్నాడని అంటున్నారు. ఆయన ప్రయత్నం ఎంతవరకూ ఫలిస్తుందో చూడాలి.

- Advertisement -