ఐపీఎల్-13లో నేడు జరిగే రెండో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. గత మ్యాచ్‌ల్లో ధనాధన్ ఆటతో ప్రత్యర్థులను బెంబేలెత్తించిన ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు ఆదివారం అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ టోర్నీలో ఇప్పటివరకు 8 మ్యాచ్ లు ఆడి 6 విజయాలు సాధించిన ముంబయి ఈ పోరులో ఫెవరెట్ గా నిలుస్తోంది.
తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండానే బరిలో దిగుతున్నట్లు రోహిత్ చెప్పాడు. పాయింట్ల పట్టికలో ముంబై రెండో స్థానంలో ఉండగా పంజాబ్ ఆఖరి స్థానంలో ఉంది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే పంజాబ్ ప్రతీ మ్యాచ్‌లో గెలవాల్సిందే. ఈ మ్యాచ్‌లో గెలిచి ముంబైపై ప్రతీకారం తీర్చుకోవాలని కింగ్స్ ఎలెవన్ జట్టు భావిస్తోంది. మరోసారి పంజాబ్‌ను ఓడించాలని రోహిత్ సేన కూడా పట్టుదలతో ఉంది.
ముంబయి ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా, నాథన్ కౌంటర్‌నైల్, రాహుల్ చాహర్, ట్రెంట్ బోల్ట్, జాస్ప్రిత్ బుమ్రా.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్: కేఎల్ రాహుల్ (కెప్టెన్/వికెట్ కీపర్), మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, నికోలస్ పూరన్, గ్లెన్ మాక్స్‌వెల్, దీపక్ హుడా, క్రిస్ జోర్డాన్, మురుగన్ అశ్విన్, మహమ్మద్ షమి, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్.