ఈ వారం ఇద్దరు ఎలిమినేషన్.. ప్రోమో

35
bb4

బిగ్ బాస్-4 తెలుగు రియాలిటీ షో రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది. ఇంటి సభ్యుల గొడవలు, ఏడుపులు, టాస్కులతో ప్రేక్షకుడికి కావాల్సిన వినోదం బాగానే లభిస్తోంది. అయితే ఈ వారం ఎవరు ఎలిమినేషన్ అవుతారన్నదానిపై హోస్ట్ నాగార్జున సస్పెన్స్ క్రియేట్ చేశాడు. తాజాగా విడుదలైన ప్రోమోలో నాగార్జున బ్యాక్ సర్దుకోమని చెప్పిన ఆ ఇద్దరు ఎవరు.. ఇంతకీ ఈ వారం ఎవరు బయటికి వెళ్ళబోతుందెవరు అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు కుమార్ సాయి బయటికి వచ్చేస్తాడనే వార్తలు వచ్చాయి.

అయితే సాయిని ఎలిమినేట్ చేస్తున్నారనే వార్తలు రాగానే సోషల్ మీడియాలో బిగ్ బాస్‌పై నెటిజన్లు కామెంట్స్ కూడా మొదలైపోయాయి. కావాలనే కుమార్ సాయిని ఎలిమినేట్ చేసి.. తక్కువ ఓట్లు వచ్చిన మోనాల్‌ను సేవ్ చేస్తున్నారని టాక్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు విడుదలైన ప్రోమోలో మాత్రం ఇద్దర్ని బ్యాగులు సర్దుకొమ్మని చెప్పాడు నాగార్జున. అందులో ఒకరు మోనాల్ అని తెలుస్తుంది. అందులో ఆమె బ్యాగ్ సర్దుకోవడం స్పష్టంగా కనిపిస్తుంది. మరొకరు ఎవరు అనేది మాత్రం సస్పెన్స్. ఇద్దర్ని ఎలిమినేట్ చేస్తారా లేదంటే చివర్లో ట్విస్ట్ ఇచ్చి ఒకర్ని సేవ్ చేస్తారా అనేది చూడాలి.

Elimination process lo twist..Single or Double ?? #BiggBossTelugu4 today at 9 PM on #StarMaa