పంజాబ్‌పై ముంబై ఘనవిజయం..

82
ipl

ఐపీఎల్ సెకండ్ ఫేజ్‌ 2021లో భాగంగా బోణి కొట్టింది ముంబై. పంజాబ్ విధించిన 136 పరుగుల స్వల్ప లక్ష్యచేధనలో బరిలోకి దిగిన ముంబై 19 ఓవర్లలో 4 వికెట్లు కొల్పోయి 137 పరుగులు చేసింది. రోహిత్‌ (8), సూర్యకుమార్‌ (0) విఫలమైన డికాక్ (27) పర్వాలేదనిపించగా చివర్లో హార్ధిక్ పాండ్యా చెలరేగడంతో ముంబై విజయం ఖాయమైంది.

పాండ్యా పాండ్యా (30 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 40 నాటౌట్‌) ,సౌరభ్ తివారి(45) పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చారు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా పొలార్డ్‌ నిలిచాడు.

అంతకముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ను ముంబై బౌలర్లు వరుస వికెట్లతో వణికించారు. మార్‌క్రమ్‌, హూడా (28) జోడీ ఆదుకోకపోతే పంజాబ్‌కు వంద పరుగులు కూడా కష్టమయ్యేది. ఓ దశలో 48/4 స్కోరుతో పంజాబ్‌ పరిస్థితి దయనీయంగా మారగా మార్‌క్రమ్‌, హూడా (28) క్రీజులో నిలిచి అడపాదడపా బౌండరీలతో స్కోరును పెంచారు. పోలార్డ్ ఒకే ఒవర్‌లో రెండు వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నారు.