లిఫ్ట్ ఇచ్చి… రూ.1500 చలాన్ కట్టాడు..

261
Mumbai trafic police
- Advertisement -

సాధారణంగా ఎవరైనా లిఫ్ట్ అడిగితే ఇస్తుంటాం.. మరి కొందరు అడగకపోయినా ఇబ్బందిని గమనించి లిఫ్ట్ ఇస్తుంటారు. కానీ మహారాష్ట్ర ట్రాఫిక్ పోలీసులు మాత్రం తెలియని వ్యక్తులకు లిఫ్ట్ ఇస్తే చలాన్ కట్టాలని స్పష్టం చేస్తున్నారు. ముంబైకి చెందిన నితిన్ నాయర్ అనే వ్యక్తి గుర్తు తెలియని వ్యక్తులకు లిఫ్ట్ ఇచ్చినందుకు ముంబై ట్రాఫిక్ పోలీసులు రూ.1500 చలాన్ వేశారు. తనకు ఎదురైన అనుభవాన్ని నితిన్ ఫేస్ బుక్ ద్వారా తెలియజేశాడు.

Maharashtra-Man-Fined

వివరాల్లోకి వెళ్తే.. జూలై 18న ఐరోలి సర్కిల్ లో నితియ్ నాయర్ వెళ్తున్నాడు. ఆ సమయంలో రోడ్డు పక్కన ముగ్గురు వ్యక్తులు, వర్షంలో తడుస్తుండడం గమనించిన నాయర్, ఆ ముగ్గురు వ్యక్తులను తన కారులో ఎక్కించుకున్నాడు. అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ ఈ విషయాన్ని గమనించి… నితిన్ వద్దకు వచ్చి రూ .1500 చలాన్ విధించాడు. తన దగ్గర ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ సైతం తీసుకున్నాడు. ఇదేంటని నితిన్ ప్రశ్నించగా.. సెక్షన్ 66/192 ప్రకారం గుర్తు తెలియని వ్యక్తులకు లిఫ్ట్ ఇవ్వడం నేరమని, చలాన్ కట్టి లైసెన్స్ తీసుకెళ్లాలని సూచించాడు.

అయినా.. నితిన్ మాత్రం ఆ ముగ్గురు వ్యక్తులను వారి గమ్య స్థానాలకు చేర్చాడు. మరుసటి రోజు కోర్టుకు వెళ్లి చలాన్ కట్టి లైసెన్స్ తీసుకున్నాడు. తనకు ఎదురైన అనుభవాన్ని ఫేస్ బుక్ ద్వారా వెల్లడించాడు. గుర్తు తెలియని వ్యక్తులకు లిఫ్ట్ ఇచ్చి తనలా.. ఇబ్బందులు ఎదుర్కోవద్దని సూచించాడు. ఈ పోస్టు చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పోస్టు వైరల్ అవుతోంది.

- Advertisement -