అర్ధం చేసుకున్నందుకు ధ‌న్య‌వాదాలుః యాంక‌ర్ ర‌ష్మీ

343
Rashmi
- Advertisement -

త‌న యాంక‌రింగ్ తో బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తోంది ర‌ష్మీ. అంతేకాకుండా బుల్లి యాంక‌ర్ ర‌ష్మీ చాలా మంది అభిమానుల‌ను సంపాదించుకున్నారు.జ‌బ‌ర్ధ‌స్ద్ షో లో యాంక‌రింగ్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది ర‌ష్మీ. క‌మెడియ‌న్ సుడిగాలి సుధీర్ యాంక‌ర్ ర‌ష్మీని ప్రేమిస్తోన్న విష‌యం తెలిసిందే. ఈసంద‌ర్భంగా ప‌లు షోల ద్వారా సుధీర్ త‌న ప్రేమ‌ని పంచుకుంటాడు. గ‌త 5సంవ‌త్స‌రాలుగా ర‌ష్మీని ప్రేమిస్తున్నాన‌ని ఓ షో కూడా చెప్పిన విష‌యం తెలిసిందే.

rasmi

ఇటివ‌లే ఓ అభిమాని సుధీర్ ర‌ష్మీల ప్రేమ వ్య‌వ‌హారం గురించి ర‌ష్మీకి ట్వీట్ చేశాడు. ర‌ష్మీ నువ్వు సుధీర్ ను పెళ్లి చేసుకో.. మీరిద్ద‌రూ ఒక‌రి కోసం మ‌రొక‌రు పుట్టిన‌ట్టు ఉంటార‌ని…ఇద్ద‌రూ కెరీర్ కోసం చాలా క‌ష్ట‌ప‌డుతున్నార‌ని ట్వీట్ చేశారు. ఓ నెటిజ‌న్ చేసిన ట్వీట్ కు ఘాటుగా స్పందించింది ర‌ష్మీ. తెర‌పై మా ఇద్ద‌రిని చూసి ఒక‌రికోసం ఒక‌రు పుట్టారని చెప్ప‌డం స‌రికాద‌న్నారు. ఏదైనా షోలో ప్ర‌జ‌ల‌ను న‌వ్వించ‌డానికే తాము అలా చేస్తామ‌ని..ద‌య‌చేసి ప్రేక్ష‌కులు త‌ప్పుగా అర్ధం చేసుకోవ‌ద్ద‌న్నారు.

rashmi

ఇక ర‌ష్మీ ఇలా రిప్లే ఇవ్వ‌గా మ‌రో నెటిజన్ ర‌ష్మీకి అనుకూలంగా మ‌రో ట్వీట్ చేశాడు. మీ నిర్ణ‌యం బాగుంది.. కేవలం ప్రేక్ష‌కులు అడుతున్నార‌ని వాళ్లు పెళ్లి చేసుకుంటే భ‌విష్య‌త్తులో వారిద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లై విడిపోతే అప్పుడు మ‌నం వాళ్ల‌ను క‌లప‌లేం క‌దా..ఆమె ఒక అమ్మాయి త‌న‌కంటూ కొన్ని ఆలోచ‌న‌లు ఉంటాయి. ఆమెను త‌న సొంత దారిలో వెళ్ల‌నివ్వండి అంటూ ఓ నెటిజ‌న్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ పై స్పందించిన ర‌ష్మీ అర్ధం చేసుకున్నందుకు ధ‌న్య‌వాదాలు అని ర‌ష్మీ రిప్లే ఇచ్చింది.

- Advertisement -