ఐపిఎల్ 12 సీజన్ ముగిసింది. నిన్న రాత్రి ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషన్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో 1 పరుగు తేడాతో చెన్నై పై ముంబై విజయం సాధించింది. దీంతో ఐపిఎల్ 12 ట్రోఫిని సొంతం చేసుకుంది ముంబై ఇండియన్స్.. ఉద్రిక్తంగా సాగిన ఈ మ్యాచ్ లో చివరి బంతి వరకూ ఎవరూ గెలుస్తారో అన్న దానిపై ఆసక్తి నెలకొంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై నిర్ణిత 20ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 149పరుగులు చేసింది. ఓపెనర్ డికాక్ 17బంతుల్లో 29పరుగులు చేసి అవుట్ కాగా, కెప్టెన్ రోహిత్ వర్మ 14బంతుల్లో 15 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ 15 బంతుల్లో 17 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. పోలార్డ్ 25 బంతుల్లో 40పరుగులు చేసి ముంబైని గట్టెక్కించాడు.
చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్ 3 వికెట్లు తీసుకోగా, శార్దూల్ ఠాకూర్, ఇమ్రాన్ తాహిర్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. ఆ తర్వాత 150పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన చైన్నై చివరి బంతి వరకూ పోరాడిన ఫలితం లేకపోయింది. ఒక్క పరుగు తేడాతో చెన్నై టైటిల్ మిస్ చేసుకుంది. చెన్నై బ్యాట్స్ మెన్లలో ఒక్క షేన్ వాట్సన్ తప్ప మిగతా వారందరూ విఫలమయ్యారనే చెప్పుకోవాలి. షేన్ వాట్సన్ 59బంతుల్లో 80పరుగులు చేశాడు. ఫా డుప్లెసిస్ 26 పరుగులు చేశాడు. ఆ తర్వాత బ్రావో ఒక్కడే 15 పరుగులు చేశారు. చివరి ఓవర్లలో 6 బంతుల్లో 9పరుగులు చేయాలి. వాట్సన్ ఉండటంతో అందరూ చెన్నై గెలుస్తుందని అనుకున్నారు. మలింగ వేసిన చివరి ఓవర్లో తొలి మూడు బంతుల్లో నాలుగు పరుగులు మాత్రమే వచ్చాయి.
ఐదో బంతిఇ పరుగు తీసే క్రమంలో వాట్సన్ రన్ ఔట్ అయ్యాడు. దీంతో మ్యాచ్ మరింత టెన్షన్ గా మారింది. చివరి రెండు బంతుల్లో నాలుగు పరుగులు అవసరం కాగా, ఐదో బంతికి రెండు పరుగులే వచ్చాయి. ఆఖరి బంతికి విజయానికి రెండు పరుగులే అవసరం కానీ శార్దూల్ అవుట్ కావడంతో ముంబై విజయం సాధించింది. జస్ప్రిత్ బుమ్రా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. ఐపీఎల్ ట్రోఫీ విజేతగా నిలిచిన ముంబై రూ.20 కోట్ల ప్రైజ్ మనీ అందుకోగా, రన్నరప్ చెన్నై రూ.12.5 కోట్లు అందుకుంది.