ముంబయి ఇండియన్స్ సొంతగడ్డపై మరో విజయాన్ని అందుకుంది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న రోహిత్‌సేన ఆదివారం వాంఖడేలో జరిగిన మ్యాచ్‌లో 13 పరుగుల తేడాతో కోల్‌కతాను ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 181 పరుగులు చేసింది. ఓపెనర్లు సూర్యకుమార్ యాదవ్ (39 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 59), ఎవిన్ లూయిస్ (43)తో పాటు ఆఖర్లో హార్దిక్ పాండ్యా (20 బంతుల్లో 35 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. కోల్‌కతా బౌలర్లలో ఆండ్రీ రస్సెల్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. అనంతరం కోల్‌కతా ఓవర్లన్నీ ఆడి ఆరు వికెట్లకు 168 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. రాబిన్ ఊతప్ప (35 బంతుల్లో 54), కెప్టెన్ దినేశ్ కార్తీక్ (36 నాటౌట్) పోరాటం వృథా అయింది. బౌలింగ్‌లోనూ రాణించిన హార్దిక్ (4-0-19-2) కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
ముంబయి ఇండియన్స్ ఇన్నింగ్స్: సూర్యకుమార్ (సి) కార్తీక్ (బి) రసెల్ 59; లూయిస్ (సి) లిన్ (బి) రసెల్ 43; రోహిత్ (సి) ఆర్కే సింగ్ (బి) నరైన్ 11; హార్దిక్ పాండ్య నాటౌట్ 35; కృనాల్ పాండ్య (సి) శుభ్‌మన్ (బి) నరైన్ 14; డుమిని నాటౌట్ 13; ఎక్స్‌ట్రాలు 6 మొత్తం: (20 ఓవర్లలో 4 వికెట్లకు) 181;
వికెట్ల పతనం: 1-91, 2-106, 3-127, 4-151;
బౌలింగ్: నితీశ్ రాణా 2-0-17-0; కృష్ణ 4-0-39-0; జాన్సన్ 3-0-25-0; నరైన్ 4-0-35-2; చావ్లా 3-0-35-0; కుల్‌దీప్ యాదవ్ 2-0-17-0; రసెల్ 2-0-12-2.
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: లిన్ (సి) బుమ్రా (బి) మెక్లనగన్ 17; శుభ్‌మన్ (సి) కృనాల్ (బి) హార్దిక్ 7; ఉతప్ప (సి) కటింగ్ (బి) మార్కండే 54; నితీశ్ (సి) బుమ్రా (బి) హార్దిక్ 31; దినేశ్ కార్తీక్ నాటౌట్ 36; రసెల్ (సి) కృనాల్ (బి) బుమ్రా 9; నరైన్ (సి) రోహిత్ (బి) కృనాల్ 5; చావ్లా నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 9 మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 168;
వికెట్ల పతనం: 1-28, 2-28, 3-112, 4-115, 5-131, 6-163;
బౌలింగ్: మెక్లనగన్ 4-0-30-1; బుమ్రా 4-0-34-1; హార్దిక్ 4-0-19-2; కృనాల్ 3-0-29-1; మార్కండే 3-0-25-1; కటింగ్ 2-0-23-1