అంబానీ కూతురితో ఆనంద్‌ పిరమల్ పెళ్లి..

268
Isha Ambani to Marry Anand Piramal
- Advertisement -

ఇటీవలే కుమారుడి నిశ్చితార్థం జరిపించిన రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ ఇంట వరుస పెళ్లిళ్ల సందడి మెదలైంది. ఆయన కుమార్తె ఈషా అంబానీ.. పిరమల్‌ గ్రూప్‌ వారసుడు, అజయ్‌ పిరమల్‌, స్వాతి దంపతుల కుమారుడు ఆనంద్‌ పిరమల్‌ను పెళ్లి చేసుకోబోతోంది. ఈ సందర్భంగా కాబోయే వధూవరులు తమ కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం రాత్రి ముంబయిలోని ఇస్కాన్‌ ఆలయాన్ని దర్శించుకున్నారు.

Isha Ambani to Marry Anand Piramal

పింక్ కలర్ గాగ్రాలో ఇషా మెరిసిపోతుండగా, నీతా అంబానీ ముంబై ఇండియన్స్ జెర్సీ ధరించి ఆలయానికి వచ్చారు. వీరికి స్వాగతం పలికిన ఆలయ అధికారులు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా, ఇషా, ఆనంద్ ల వివాహం డిసెంబర్ లో జరగనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఇషా కవల సోదరుడు ఆకాశ్ అంబానీ నిశ్చితార్థం వజ్రాల వ్యాపారి రసెల్ మెహతా కుమార్తె శ్లోకతో జరుగగా, వీరిద్దరి పెళ్లి కన్నా ముందే ఇషా పెళ్లి జరుగుతుందని తెలుస్తోంది.

Isha Ambani to Marry Anand Piramal

ఇటీవల మహాబలేశ్వర్‌లోని ఓ ఆలయంలో ఆనంద్‌.. ఈశాతో పెళ్లి ప్రస్తావన తీసుకురాగా అందుకు ఆమె అంగీకరించినట్లు తెలిసింది. వీరి వివాహానికి ఇరు కుటుంబాలు కూడా ఒప్పుకుని కలిసి విందు చేసుకున్నారు. ఆనంద్‌ తల్లిదండ్రులు స్వాతి, అజయ్‌ పిరమాల్‌, సోదరి నందిని, ఈశా తల్లిదండ్రులు నీతా, ముకేశ్‌ అంబానీ, నానమ్మ కోకిలాబెన్‌, అమ్మమ్మ పూర్ణిమా దలాల్‌, ఈశా కవల సోదరుడు ఆకాశ్‌ అంబానీ, తమ్ముడు అనంత్‌ అంబానీ తదితరులంతా వేడుకగా ఈ విందు నిర్వహించినట్లు సమాచారం.

- Advertisement -