పంజాబ్‌ బౌలర్లకు చుక్కలు చూపించిన పొలార్డ్,పాండ్యా

153
pandya
- Advertisement -

ఐపీఎల్ 13లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై భారీ స్కోరు సాధించింది. 20 ఓవర్లో 4 వికెట్లు కొల్పోయి 191 పరుగులు చేసింది. తొలి 10 ఓవర్లలో 62 పరుగులు చేసిన ముంబై చివరి 10 ఓవర్లలో 129 పరుగులు చేసింది. ముఖ్యంగా చివరి 5 ఓవర్లలో ఏకంగా 90 పరుగులు చేసి పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించారు.

టాస్ గెలిచిన పంజాబ్‌…ముంబైని బ్యాటింగ్‌కు ఆహ్వానించగా తొలి ఓవర్‌లోనే ఆ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. డికాక్ 0గా వెనుదిరగగా తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ 10 పరుగులు చేసి వెనుదిరిగారు. ఇన్నింగ్స్ గాడిలో పెట్టే పనిని భుజాన వేసుకున్న రోహిత్, ఇషాన్ కిషన్‌ ఆరంభంలో మెల్లగా ఆడారు. తర్వాత స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.

ముఖ్యంగా రోహిత్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 45 బంతుల్లో 8 ఫోర్లు,3 సిక్స్‌లతో 70 పరుగులు చేసి ఐపీఎల్‌ చరిత్రలో 5 వేల పరుగుల మైలురాయిని దాటాడు. ఇక చివరి ఓవర్లలో పోలార్డ్, పాండ్యా విశ్వరూపం చూపించారు. ఒకరికొకరు పోటి పడి పంజాబ్ బౌలర్లను ఉతికి ఆరేశారు.పాండ్యా 11 బంతుల్లో 2 సిక్స్‌లు,3 ఫోర్లతో 30 పరుగులు చేయగా పొలార్డ్ 20 బంతుల్లో 4 సిక్స్‌లు,3 ఫోర్లతో 47 పరుగులు చేశారు. దీంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కొల్పోయి 191 పరుగులు చేసింది.

- Advertisement -