ఐపీఎల్ 2020లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఘన విజయం సాధించింది. 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 19.1 ఓవర్లలో 5 వికెట్లు కొల్పోయి 166 పరుగులు చేసి 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో కొనసాగుతోంది ముంబై.
ఓపెనర్లు ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించారు. డికాక్ 18, ఇషాన్ కిషన్ 25 పరుగులు చేసి ఔటైనా మరో ఎండ్‌లో సూర్యకుమార్ యాదవ్ తన ఒంటరి పోరాటాన్ని కొనసాగించాడు.సౌరభ్ తివారి 5,కృనాల్ 10 పరుగులు చేసి ఔటైనా సూర్యకుమార్ హాఫ్ సెంచరీతో రాణించాడు. సూర్యకుమార్ 43 బంతుల్లో 3 సిక్స్‌లు, 10 ఫోర్లతో పరుగులు చేయగా హార్ధిక్ పాండ్యా 17 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
అంతకముందు టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. దేవదత్ పడిక్కల్(74: 45 బంతుల్లో 12ఫోర్లు, సిక్స్), జోష్ ఫిలిప్(33: 24 బంతుల్లో 4ఫోర్లు, సిక్స్) రాణించడంతో 20 ఓవర్లలో 6 వికెట్లకు 164 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ(9), డివిలియర్స్(15), శివమ్ దూబే(2) నిరాశపరిచారు. ముంబై బౌలర్లలో బుమ్రా(3/14), ట్రెంట్ బౌల్ట్, రాహుల్ చాహర్, పొలార్డ్ తలో వికెట్ పడగొట్టారు.