హైదరాబాద్‌కు షాకిచ్చిన ముంబై..

33
- Advertisement -

ఐపీఎల్ 2024లో భాగంగా వరుస ఓటముల తర్వాత గెలుపు బాట పట్టింది ముంబై. సన్ రైజర్స్ విధించిన 174 పరుగుల లక్ష్యాన్ని ముంబై 17.2 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కొల్పోయి టార్గెట్‌ని చేధించింది. మిస్టర్ 360 సూర్యకుమార్ 51 బంతుల్లో 6 సిక్స్‌లు,12 ఫోర్లతో 102 నాటౌట్‌, తిలక్ వర్మ 37 నాటౌట్‌గా నిలవడంతో విజయం ఖాయమైంది.

అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్‌ 20 ఓవర్లలో 8 వికెట్లు కొల్పోయి 173 పరుగులు చేసింది. ట్రావిస్‌ హెడ్‌ 30 బంతుల్లో 48 పరుగులు చేయగా చివరలో కమిన్స్ 17 బంతుల్లో 2 సిక్స్‌లు, 2 ఫోర్లతో 35 రాణించడంతో ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ముంబై విజయంలో కీలక పాత్ర పోషించిన సూర్యకు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. ఈ ఓటమితో హైదరాబాద్ ప్లే ఆఫ్ ఆశలు సంక్లిష్టమయ్యాయి.

Also Read:KCR:బీజేపీతో వచ్చేది లేదు?సచ్చేది లేదు?

- Advertisement -