డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా సిట్ విచారణకు హాజరైన నటి ముమైత్ ఖాన్ విచారణ ముగిసింది. ముమైత్ ఖాన్‌నును.. చార్మి మాదిరిగానే సిట్ అధికారుల నేతృత్వంలో నలుగురు మహిళా అధికారుల బృందం ఆరున్నర గంటలపాటు ప్రశ్నించింది. బుధవారం నటి చార్మిపై ఓ కానిస్టేబుల్ చేయి వేసి అత్యుత్సాహం ప్రదర్శించి విమర్శలపాలైన నేపథ్యంలో ముమైత్ ఖాన్‌ను సిట్ కార్యాలయంలోపలికి తీసుకెళ్లేందుకు మహిళా పోలీసులనే ఎక్కువగా నియమించారు అధికారులు. ఇవాళ చాలా కూల్‌గా ఉదయం 9:30కే సిట్ కార్యాలయానికి వచ్చిన ముమైత్ ఖాన్.. చార్మి మాదిరిగానే ముమైత్ కూడా న్యాయ సలహాలు తీసుకునే విచారణకు వచ్చినట్టు అనుమానిస్తున్నారు. దీంతో ఆమె తిరిగి బిగ్ బాస్ సిబ్బందితో కలిసి వెనుదిరిగారు. మళ్లీ తిరిగి ఆమె బిగ్ బాస్ హౌస్ కు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఉదయం 10:30కు మొదలైన విచారణ.. 5 గంటలవరకు సాగింది. విచారణలో ముమైత్ సహకరించినట్టు అధికారులు తెలిపారు.. రక్తం గోళ్లు, వెంట్రుకల నమూనాలు ఇచ్చేందుకు ముమైత్ ఖాన్ సిద్ధపడ్డారనీ, ప్రస్తుతం అవసరంలేదని తాము చెప్పినట్టు సిట్ అధికారులు తెలిపారు. ఆమెను సిట్ అడిగిన ప్రశ్నలు ఇవేనట..
ఈ క్రమంలో ఆమెను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. సిట్ అధికారులు ముమైత్ కు సంధించిన ప్రశ్నల పరంపరలోకి వెళ్తే…మీరు డ్రగ్స్ తీసుకుంటారా? వారంతాల్లో ఎలా గడుపుతారు? పబ్ లకు తరచూ వెళ్తుంటారా? సినీ పరిశ్రమలోకి మీరు ఎలా ఎంటరయ్యారు? సినీ పరిశ్రమలోకి రాకముందు ఏం చేసేవారు? పబ్ లకు వెళ్తుంటారా? తరుణ్, నవదీప్ పబ్ లకు ఎన్నిసార్లు వెళ్లారు? పూరీ జగన్నాథ్ తో పోకిరి సినిమాతో క్లోజ్ అయ్యారా? అంతకు ముందునుంచే క్లోజ్ అయ్యారా? ముంబై నుంచి హైదరాబాదుకు కేవలం షూటింగ్స్ కోసమే వచ్చేవారా? ఎక్కువ ఐటెం సాంగ్స్ లో నటించే మీరు..చిత్ర యూనిట్ తో విదేశాలకు వెళ్లాల్సిన అవసరం ఏంటి? డ్రగ్స్ తీసుకున్నారా? డ్రగ్స్ సరఫరా చేసేవారా? హైదరాబాదును విడిచి ముంబై ఎందుకు వెళ్లారు? నెలకోసారి జరిగే గోవా ఫెస్టివల్స్ లో మీరు ఏం చేసేవారు? ప్రతినెలా జరిగే గోవా ఫెస్టివల్స్ కు హాజరయ్యేందుకు కారణం ఏంటి? ఖాళీ సమయాల్లో మీరు ఎలా గడుపుతారు? కెల్విన్ తో పరిచయం ఎలా జరిగింది? కెల్విన్ కు మీరు క్లోజా? డ్రగ్స్ తీసుకున్నారా? తెలుగు సినీ పరిశ్రమలో ఎంత మంది డ్రగ్స్ తీసుకుంటారు? మీకు పూరీ, చార్మీ మాత్రమే కాకుండా ఎంత మందితో సన్నిహిత సంబంధాలున్నాయి? వంటి ప్రశ్నలతో ఆమెను ఉక్కిరిబిక్కిరి చేశారు. అయితే ముందుగానే న్యాయ సలహా తీసుకోవడం వల్ల నో కామెంట్.. నాకు తెలియదు.. నాకు సంబంధం లేదు.. నాకు సమాచారం లేదు.. అని బదులిచ్చిన్నట్టు సమాచారం.
ముమైత్, కెల్విన్‌ల మధ్య జరిగిన వాట్సప్ మెసేజ్‌లలో కొన్ని కోడ్ భాషలను దర్యాప్తు అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. అందులో కిక్, క్రాక్ అనే పదాలకు అర్ధం ఏమిటని ముమైత్‌ను ప్రశ్నించినట్టు సమాచారం. ఎలాంటి ప్రశ్నలడిగిన ముమైత్ ముందే ప్రిపేర్ అయి వచ్చిందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా, ముమైత్ ఖాన్ బిగ్ బాస్ షోలో ఉన్న సంగతి తెలిసిందే.. 70 రోజుల పాటు కంటెస్టంట్లు ఎక్కడికి పోకూడదు.. ఖచ్చితంగా హాజరు కావాల్సిందేనంటూ సిట్ ఆర్డర్ వేయడంతో.. బిగ్ బాస్ అనుమతి తీసుకొని విచారణకు హాజరైంది.