దేశంలోనే అత్యుత్తమ గ్రామం మన ముఖ్రాకే

120
mukhrak
- Advertisement -

దేశంలోనే అత్యుత్తమంగా గ్రామంగా నిలిచి.. మన తెలంగాణను మరోసారి దేశ దృష్టిని ఆకర్షించింది. దేశానికి మరోసారి ఆదర్శంగా నిలిచింది. కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆ గ్రామాన్ని ట్వీట్ చేస్తూ, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల స్థానికీకరణ లోగోని ప్రభుత్వ భవనాల గోడల మీద ఆవిష్కరించడంలో ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖ్రాకే గ్రామం దేశానికే ఆదర్శంగా నిలిచిందని, ఈ అలంకరణ దేశానికి గొప్ప సంకల్పాన్ని ప్రతిబింబింప చేస్తోందని పేర్కొంది. దీనిపై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రీ ట్వీట్ చేశారు.

‘అవును, నిజమే! ఆదర్శ గ్రామాల అభివృద్ధికి తెలంగాణ లోని ముఖరా కె గ్రామ పంచాయతీ అనేక మైలురాళ్లను సృష్టిస్తోంది. దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. గ్రామ పంచాయతీలు ఎలా ఉండాలి? అనే అంశంపై వారి వినూత్న సృజనాత్మక ఆలోచనలు చేస్తున్న గ్రామ పరిపాలకులు, అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి, ప్రజలకు అభినందనలు’ అంటూ గ్రామ పాలక వర్గానికి, సిబ్బందికి, అధికారులు, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన స్వతంత్ర భారత వజ్రోత్సవాలు, దేశవ్యాప్తంగా నిర్వహించిన ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా సశక్త్ చాయత్ సతత్ వికాస్ పేరుతో ఆయా లోగోలను గ్రామ పంచాయతీ భవన ప్రహరీ గోడలపై పేయింటింగ్స్‌ వేశారు. అలాగే, తెలంగాణ విరామం లేని నిరంతర పంచాయతీ అభివృద్ధి, బలమైన పంచాయతీ, సుస్థిరమైన అభివృద్ధి ట్యాగ్‌లైన్‌లను చిత్రించారు. ఈ పెయింటింగ్స్ ప్రస్తుతం దేశాన్ని, కేంద్రాన్ని ఆకర్షిస్తున్నాయి. గ్రామ సర్పంచ్ మీనాక్షి, ఎంపీటీసీ సుభాష్ గాడ్ గే, ఇతర వార్డు సభ్యులు, సిబ్బంది, అధికారులు, ప్రజలకు జాతీయస్థాయిలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

 

- Advertisement -