మరోసారి అగ్రస్థానంలో నిలిచిన అంబానీ..

427
- Advertisement -

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ మరోమాసారి భారత్‌లోనే అత్యంత ధనవంతుడిగా స్థానం దక్కించుకున్నారు. ఈ ఏడాదికిగాను ఐఐఎఫ్ఎల్ వెల్త్ మేనేజ్‌మెంట్-హ్యూరన్‌లు విడుదల చేసిన ఈ జాబితాలో ముఖేష్ అంబానీ వరుసగా ఎనిమిదోసారి అగ్రస్థానంలో నిలిచారు.

రెండో స్థానంలో భారత్‌కే చెందిన లండన్ వాసులు ఎస్‌పీ హిందూజా, ఆయన కుటుంబ సభ్యులు నిలిచారు. ముఖేష్ సంపద రూ.3,80,700 కోట్లు కాగా, హిందూజాల సంపద రూ.1,86,500 కోట్లు. రూ.1,17,100 కోట్ల నికర సంపదతో విప్రో వ్యవస్థాపకుడు అజీం ప్రేమ్ జీ మూడో స్థానంలో నిలిచారు.

Mukesh-Ambanis

ఇక నాలుగో స్థానంలో ఆర్సెలార్‌ మిట్టల్‌ చైర్మన్‌, సీఈఓ ఎల్‌ఎన్‌ మిట్టల్‌ (రూ.1,07,300 కోట్లు), ఐదో స్థానంలో గౌతమ్‌ అదానీ (రూ.94,500 కోట్లు), ఆరో స్థానంలో కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ సారథి ఉదయ్‌ కోటక్‌ (రూ.94,100 కోట్లు), ఏడో స్థానంలో సైరస్‌ మిస్ర్తీ (రూ.88,800 కోట్లు), ఎనిమిదో స్థానంలో సైరస్‌ పల్లోంజీ మిస్ర్తీ (రూ.76,800 కోట్లు), తొమ్మిదో స్థానంలో షాపూర్జీ పల్లోంజీ (రూ.76,800 కోట్లు), పదో స్థానంలో సన్‌ఫార్మాసూటికల్స్‌ వ్యవస్థాపకుడు దిలీప్‌ సంఘ్వీ (రూ.71,500 కోట్లు) ఉన్నారు.

ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పారిశ్రామికవేత్తలు 74 మంది చోటు దక్కించుకున్నారు. ఈ జాబితాలో అన్ని రంగాలకు చెందిన వారు ఉండటం విశేషం. టాప్‌ 100లో ఐదుగురు తెలుగు పారిశ్రామికవేత్తలున్నారు.

- Advertisement -