‘కామసూత్ర’ వెబ్ సిరీస్‌లో సన్నీ..?

567
sunny
- Advertisement -

శృంగారతార గా ఓ వెలుగు వెలిగిన సన్నీ లియోన్ ప్రస్తుతం ఇండియన్ సిల్వర్ స్క్రీన్ ని హీటెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. హిట్లు.. ప్లాపులకు సంబంధం లేకుండా ఈ భామ వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతోంది. ఈ అమ్మడు ఒక్క బాలీవుడ్‌లోనే కాకుండా టాలీవుడ్‌,కోలీవుడ్‌లలో కూడా తన అందంతో ప్రేక్షకులను అలరిస్తోంది.

sunny-leone

ఇక తాజాగా ఈ బోల్డ్‌ బ్యూటీ ‘కామసూత్ర’ వెబ్ సిరీస్‌లో నటించనున్నట్టు తెలుస్తోంది. ఈ సిరీస్‌కు ఏక్తాకపూర్ దర్శకత్వం వహించనున్నట్టు బాలీవుడ్ సమాచారం. ‘కామసూత్ర’లో నటించాలంటూ ఏక్తాకపూర్ ఇప్పటికే సన్నీని సంప్రదించినట్టు తెలుస్తోంది. కథ విన్న సన్నీకూడా సూత్రప్రాయంగా అంగీకరించినట్టు సినీ వర్గాల టాక్‌.

అయితే, ఈ విషయంలో అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. గతంలో సన్నీ-ఏక్తాకపూర్‌లు ‘రాగిణి-ఎంఎంఎస్’ సినిమా కోసం కలిసి పనిచేశారు. కాగా, సన్నీలియోన్ ప్రస్తుతం తమిళ చిత్రం ‘వీరమాదేవి’ లో కీలకపాత్ర పోషిస్తోంది.

- Advertisement -