- Advertisement -
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మెడకు మూడు కుంభకోణం చుట్టుకుంది. మైసూరు నగరాభివృద్ధి ప్రాదికార సంస్థ కుంభకోణంలో సిద్దరామయ్యను విచారించేందుకు గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ అనుమతించారు. సంచలన నిర్ణయం తీసుకున్నారు.
సామాజిక కార్యకర్త, న్యాయవాది టిజె అబ్రహం తన భార్య బీఎం పార్వతికి కేటాయించిన భూమికి సంబంధించిన కేసులో సీఎం సిద్ధరామయ్యను ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతివ్వాలని కోరారు. అయితే గవర్నర్ అనుమతించరని సీఎం సిద్దరామయ్య భావిస్తున్న తరుణంలో షాకిస్తూ నిర్ణయం తీసుకున్నారు గెహ్లాట్.
ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం 5గంటలకు జరిగే కేబినెట్ సమావేశంలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గవర్నర్ తీసుకున్న నిర్ణయం కన్నడ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
Also Read:TTD: శాస్త్రోక్తంగా వరలక్ష్మీ వ్రతం
- Advertisement -