కరోనా ప్రభావంతో చెన్నైని విడిన ధోనీ..

503
dhoni
- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌(కోవిడ్‌-19) ప్రభావంతో పలు క్రీడా టోర్నీలు వాయిదా పడుతున్నా విషయం తెలిసిందే. కాగా కరోనా భయంతో ఐపీఎల్ పోటీలు వాయిదా పడ్డాయి. వాస్తవానికి ఐపీఎల్ పోటీలు ఈ నెల 29 నుంచి ప్రారంభం కావాల్సివుండగా, వాటిని ఏప్రిల్ 15కు వాయిదా వేస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. మరి అప్పుడన్నా ప్రారంభమవుతాయా? అన్న విషయంపైనా సందేహాలు నెలకొనివున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ కోసం సన్నద్ధమవుతున్న ఆటగాళ్లు ఇంటిముఖం పట్టారు.

ఐపీఎల్ వాయిదాతో చెన్నై ఫ్రాంచైజీ యాజమాన్యం, ప్రాక్టీస్ సెషన్ ను తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో ఆ జట్టు కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ చెన్నై విడిచి సొంతూరుకు వెళ్లాడు. రాంచీకి బయలుదేరేముందు తనను చూసేందుకు వచ్చిన అభిమానులతో మహీ ఫొటోలు దిగుతూ ఆటోగ్రాఫ్‌లు ఇచ్చాడు. గత కొన్ని రోజుల నుంచి ఎంఏ చిదంబరం స్టేడియంలో తొలి ప్రాక్టీస్‌ సెషన్‌లో ధోనీ పాల్గొని సాధన చేశాడు. చాలా కాలం తర్వాత మహీ సన్నాహకానికి దిగడంతో అభిమానులు పెద్ద సంఖ్యలో స్టేడియానికి వచ్చారు. హిట్టింగ్‌తో ఫ్యాన్స్‌ను ధోనీ అలరించాడు.

- Advertisement -