చాలమంది కారం తినడానికి భయపడతారు.. వంటల్లో కాస్త కారం ఎక్కువైనా తట్టుకోలేరు. ఇంక చెప్పాలంటే కారం చాలా తక్కువ మోతాదుల్లో వాడుతుంటారు. కొందరైతే కారం ఎక్కువ తింటే అనారోగ్యం బారిన పడతామని, హైబిపి వంటి సమస్యలు వస్తాయని చెబుతుంటారు. అయితే ఈ విషయాలు నిజమే అయినప్పటికి కారం తగు మోతాదులో తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని ఆహార నిపుణులు చెబుతున్నారు. పచ్చి మిరపకాయలో విటమిన్ సి, విటమిన్ కె, వంటివి అధికంగా ఉంటాయి. అందువల్ల కారంగా తినే వారిలో రోగనిరోధక శక్తి కూడా ఎక్కువగానే ఉంటుందట. అలాగే కారం ఎక్కువ తినే వారికి గుండె సంబందిత సమస్యలు వచ్చే అవకాశం కూడా తక్కువేనట…
తగినంత కారం తినడం వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి వ్యాధులు కూడా రావని నిపుణులు చెబుతున్నారు. పచ్చిమిర్చిలో ఉండే క్యాప్సైసిన్ మూలకం వంటల్లో రుచిని పెంచుతుంది. అంతే కాకుండా మిర్చిలో బీటా కేటోరిన్, ఐరన్ వంటి మూలకాలు కూడా ఉంటాయి. బీటా కేటోరిన్ కంటి చూపును మెరుగుపరుస్తుంది. అలాగే ఐరన్ ఎముకల ధృడత్వాన్ని పెంచుతుంది. పచ్చి మిర్చిలో ఎర్రరక్త కణాల వృద్దిని పెంచే గుణాలు ఉంటాయి. అందువల్ల రక్త హీనత వంటి సమస్యలు దూరం అవ్వడంతో పాటు రక్త నాళాల్లో రక్తం గడ్డకట్టడాన్ని కూడా నిరోదిస్తుంది.
వంటల్లో పచ్చిమిర్చిని అధికంగా ఉపయోగించడంవల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అజీర్తి వంటి సమస్యలు దూరం అవుతాయి. బ్యాక్టీరియాల్ ఇన్ఫెక్షన్స్ కూడా దరి చేరకుండా ఉంటాయి. లోబీపీ తో బాధపడే వాళ్ళు రోజుకు ఒకటి నుంచి రెండు మిర్చిలను తినడం వల్ల బీపీ అదుపులోకి వస్తుంది. ఇంకా కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, షుగర్ సంబంధిత వ్యాధులతో భాదపడే వారికి పచ్చి మిర్చి తినడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి ఇన్ని ఉపయోగాలు ఉన్న పచ్చి మిర్చిని కారంగా ఉందని తినకుండా ఉండడం కరెక్టేనా చెప్పండి..
Also Read:కిడ్నీ వ్యాధులను..తగ్గించుకోండిలా!