సీఎం కేసీఆర్ మంత్రివర్గంలోకి మాజీ ఎంపీ వినోద్..?

507
mp vinod
- Advertisement -

తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై మరోసారి పుకార్లు షికార్ చేస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని సీఎం కేసీఆర్ పార్టీ నేతలకు సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కేబినెట్‌లో ఆరుగురికే ఛాన్స్ ఉండటంతో ఎవరెవరికి బెర్త్ కన్ఫామ్‌ అవుతుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ సారి కేబినెట్‌లో సీనియర్లు,తనకు అత్యంత సన్నిహితులకు పెద్దపీట వేయనున్నారు సీఎం కేసీఆర్. ఈ నేపథ్యంలో పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వినోద్‌ని కేబినెట్‌లోకి తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో కరీంనగర్‌ నుంచి పోటీచేసి ఓడిపోయిన వినోద్‌…పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఆయన సేవలను మరింతగా వినియోగించుకునేందుకు ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయాలని గులాబీ బాస్ భావిస్తున్నారట.

ఎప్పుడు విస్తరణ జరిగినా వినోద్‌కు కేబినెట్ బెర్త్ ఖాయమని తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటాలో వినోద్‌ను ఎమ్మెల్సీని చేసి మంత్రిగా ప్రమోషన్‌ ఇవ్వనున్నారని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఎంపీగా ఆయన ఓటమి తర్వాత వినోద్‌ని రాజ్యసభకు పంపుతారని వార్తలు వెలువడ్డాయి. అయితే తెలంగాణలో రాజ్యసభ స్ధానం ఖాళీ అవడానికి ఇంకా సమయం ఉండటంతో ఆయన్ని తన టీంలోకి తీసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియదు గాని ప్రస్తుతం రాజకీయవర్గాల్లో మాత్రం హాట్‌ టాపిక్‌గా మారింది.

- Advertisement -