International Tiger Day:పులులను సంరక్షిద్దాం

47
- Advertisement -

పులి.. ఫెలిడే కుటుంబంలో కెల్లా అతిపెద్ద జాతి. ఇది పాంథెరా ప్రజాతిలో భాగం. ఆరెంజి-బ్రౌన్ చర్మంపై చిక్కటి నిలువు చారలు దీని ప్రత్యేకత. ఈ నిలువుచారలు కిందికి వెళ్ళే కొద్దీ పలచబడతాయి. ఒంటరిగా జీవించే వేట జంతువు. తన సంతానాన్ని పోషించుకునేందుకు తగినంత ఆహారం లభించే విశాలమైన ఆవాస ప్రాంతాల కోసం వెతుకుతుంటాయి. పులి పిల్లలు స్వతంత్రంగా జీవించే ముందు రెండేళ్లపాటు తల్లితో కలిసి ఉంటాయి. ఆతర్వాత అయి కూడా స్వతంత్రంగా వేటాడటం మొదలుపెడతాయి.

పులి.. వేటాడే జంతువు. అందుకే దానిని చూస్తే మనం బయపడతం. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రపంచ వ్యాప్తంగా పులుల సంఖ్య 100 ఏళ్ల క్రితం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు లక్ష పులులు ఉండేవని అంచనా. ఇక ఇవాళ అంతర్జాతీయ టైగర్స్ డే సందర్భంగా వాటిని కాపాడుకుందాం.

ఇక అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా పులులను సంరక్షిద్దాం అని పిలుపునిచ్చారు ప్రకృతి ప్రేమికుడు, ఎంపీ సంతోష్ కుమార్.ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన సంతోష్ కుమార్… ప్రకృతిని సంరక్షించి..మానవాళినే కాదు అపురూపమైన పులులను కూడా సంరక్షిద్దాం అన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ #GreenIndiaChallengeలో భాగంగా మరిన్ని మొక్కలు నాటి అడవులను సంరక్షిద్దాం అన్నారు. పులులతో పాటు వన్యప్రాణుల సంరక్షణ కోసం పచ్చని వాతావరణాన్ని సృష్టిద్దాం..ఇది మన పర్యావరణంపై మంచి ప్రభావాన్ని చూపుతుందని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

Also Read:మణిపూర్ ఎఫెక్ట్..బీజేపీ వీడుతున్నా నేతలు!

ప్రస్తుతం ప్రపంచంలో దాదాపు 5,000 పులులు మాత్రమే ఉన్నాయి. అందులో 3,000కు పైగా భారత్ లోనే ఉన్నాయి. పులులు అంతరించిపోకుండా ప్రపంచం జాగ్రత్తలు తీసుకుంటోంది. వాటిని రక్షించునే ఉద్దేశంతో 2010 నుంచి జూలై 29న ఇంటర్నేషనల్ టైగర్ డేను నిర్వహిస్తున్నారు.

Also Read:CM KCR:31న రాష్ట్ర కేబినెట్ భేటీ..

- Advertisement -