- Advertisement -
ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో భాగంగా తన పుట్టినరోజు సందర్బంగా మొక్కలు నాటారు ఎంపీ సంతోష్ కుమార్ పీఏ కె.శ్రీకాంత్ రావు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రావు మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని పుట్టినరోజు సందర్బంగా మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు.
ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు.ఇంత మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు ఎంపీ సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో ఎన్.సురేష్ కుమార్ ,ఆర్.రాజేష్ ,జి.అప్పు రెడ్డి,జి.సంతోష్ రెడ్డి పాల్గొన్నారు.
Also Read:ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ అమోదం..
- Advertisement -