ఉపరాష్ట్రపతికి వృక్షవేదం పుస్తకాన్ని అందజేసిన ఎంపీ సంతోష్‌..

241
trs
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం లో ఉన్న అడవులు మరియు పకృతి చిత్రాలు పురాణాలలో పకృతి గురించి చెప్పిన శ్లోకాలతో ప్రత్యేకంగా రూపొందించిన వృక్ష వేదం పుస్తకాన్ని ఈరోజు హైదరాబాద్ లోని తన నివాసంలో కలిసి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి అందజేశారు రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ .

ఈ పుస్తకాన్ని చూసిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు పుస్తకం చాలా అద్భుతంగా ఉందని ఈ పకృతి చిత్రాలను చూస్తూ ఉంటే నా చిన్నతనంలో మా నానమ్మ అమ్మమ్మ వాళ్ళతో కలిసి అడవుల్లోకి పొయి వచ్చిన రోజులు గుర్తుకు వస్తున్నాయి అని అన్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పకృతి కి దూరంగా ఉన్న వారికే వచ్చినది అని పకృతి తో కలిసి జీవించిన వారు కరోనా వైరస్ బారిన పడలేదు అన్నారు.

ఈ సందర్భంగా పుస్తకంలో ప్రచురించిన వ్యర్థంగా వృక్షాలను నరికే వాడు నాడీ భాగంలో పుండు గల వాడవుతాడు అంటే ప్రాణవాయువు లోపం వలన వ్యాధిని పొందుతాడు అని అర్థం అనే శ్లోకం ను చదివి వినిపించారు.తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా మీరు వినూత్నంగా చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమం చాలా గోప్పగా విజయవంతం అయినది అని ఇతరులకు ఈ కార్యక్రమం ఆదర్శంగా నిలిచింది అని కొనియాడారు.

మీరు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చాలా అద్భుతంగా ముందుకు కొనసాగుతుందని ఇదే విధంగా ముందుకు కొనసాగించాలని నా యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి అని రాజ్యసభ సభ్యులు సంతోష్ గారికి తెలపడం జరిగింది. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు తన ట్విట్టర్ ఖాతాలో ఈ క్రింది విధంగా తెలిపారు. రాజ్యసభ సభ్యులు శ్రీ జె.సంతోష్ కుమార్ గారు రూపొందించిన వృక్షవేదం పుస్తకాన్ని చూసి ఆనందం కలిగింది. ప్రకృతి పరిరక్షణకు సంబంధించి భారతీయ వాజ్ఞ్మయంలోని శ్లోకాలు, వాటి అర్ధాలు, తెలంగాణ రాష్ట్ర ప్రకృతి ఛాయాచిత్రాలతో పుస్తకాన్ని చక్కగా తీర్చిదిద్దిన తీరు అభినందనీయం అన్నారు.

- Advertisement -