దిగ్విజయ్ సింగ్ పై నాన్ బెయిలబుల్ వారంట్ జారీ

41
digvijay singh

కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ పై నాన్ బెయిలబుల్ వారంట్ జారీ అయింది. ఈ మేరకు దిగ్విజయ్ సింగ్ పై ఎన్ బీడబ్ల్యూ జారీ చేసిన ప్రజా ప్రతినిధుల కోర్టు. ఎంఐఎం నాయకుడు హుస్సేన్ అన్వర్ దాఖలు చేసిన పరువునష్టం కేసు విచారణలో ఈ తీర్పు వెలువరించింది. ఎంఐఎంపై 2016లో దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై విచారణ…ఈ విచారణకు హాజరుకానందున దిగ్విజయ్ సింగ్ పై ఎన్ బీడబ్ల్యూ జారీ అయింది.

అనారోగ్యం కారణంగా నేటి విచారణకు మినహాయింపు కోరారు దిగ్విజయ్ సింగ్. అయితే దిగ్విజయ్ సింగ్ అభ్యర్థన తోసిపుచ్చింది ప్రజా ప్రతినిధుల కోర్టు. విచారణ మార్చి 8కి వాయిదా వేసింది ప్రజా ప్రతినిధుల కోర్టు.