IPL:కార్తిక్ త్యాగిపై డేల్ స్టెయిన్‌

6
- Advertisement -

ఐపీఎల్ 2026లో యువ ఆటగాళ్ల ప్రదర్శనపై దృష్టి కేంద్రీకృతమవుతోంది. ముఖ్యంగా కోల్‌కతా నైట్ రైడర్స్ యువ పేసర్ కార్తిక్ త్యాగిపై మాజీ దక్షిణాఫ్రికా స్టార్ బౌలర్ డేల్ స్టెయిన్‌ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

కార్తిక్ త్యాగి తన బౌలింగ్ యాక్షన్‌ను పదేపదే మార్చడం ప్రధాన సమస్యగా కనిపిస్తోంది.త్యాగి మళ్లీ తన యాక్షన్ మార్చాడు. అతనికి మంచి వేగం, నైపుణ్యం ఉన్నా, తన శరీర సామర్థ్యంపై విశ్వాసం లోపిస్తోంది. ఇతర బౌలర్ల యాక్షన్‌ను కాపీ చేయడం కొంతవరకు ఉపయోగపడినా, చివరికి తనదైన శైలిని అభివృద్ధి చేసుకోవాలి అని స్టెయిన్ పేర్కొన్నారు.

ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో త్యాగి ఆశించిన స్థాయిలో ప్రదర్శన ఇవ్వలేకపోయాడు.4 ఓవర్లలో 43 పరుగులు ఇచ్చాడు.1 వికెట్ మాత్రమే తీసుకున్నాడు (సూర్యకుమార్ యాదవ్).

Also Read:కొవిడ్ కొత్త వేరియంట్..లక్షణాలివే!

గత ఐపీఎల్‌లో త్యాగి పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. 2024లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడినప్పుడు కూడా 51 పరుగులు ఇచ్చి వికెట్లు సాధించలేదు.

- Advertisement -