కాంగ్రెస్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చిక్కుల్లో పడ్డారు. పీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ వారం రోజుల కంటే ఎక్కువ రోజులు బతకడని,తన అభిమానులు చంపేస్తారని ఆయన కుమారుడు డాక్టర్ సుహాస్‌కు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారు కోమటిరెడ్డి. అంతేకాదు నీ ఆస్పత్రిని కూడా కూల్చేస్తారంటూ బండబూతులు తిట్టాడు. కోమటిరెడ్డి – సుహాస్ మధ్య జరిగిన సంభాషణ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మావాళ్లు మొన్నటిదాకా ఓపిక పట్టారు. క్షమాపణ చెప్పకపోతే చంపేస్తారంటూ వార్నింగ్ ఇచ్చారు.
చెరుకు సుధాకర్‌పై అసభ్య వ్యాఖ్యలు చేసిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దిష్టిబొమ్మను నల్లగొండలో బీసీ విద్యార్థి సంఘం నేతలు దహనం చేశారు. చెరుకు సుధాకర్ హత్యకు ప్లాన్ చేసిన వెంకట్‌రెడ్డిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
తనతో పాటు తన తండ్రి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ను చంపేస్తారంటూ ఫోన్లో బెదిరించిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డాక్టర్ చెరుకు సుహాస్ నల్లగొండ వన్‌టౌన్ పోలీసస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంకట్‌రెడ్డిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, తమకు ప్రాణహాని ఉన్నందున రక్షణ కల్పించాలని కోరారు.
ఇవి కూడా చదవండి..