టీ న్యూస్‌ ఎడ్యుకేషన్‌ ఫెయిర్..అభినందనీయం

203
mp kavitha
- Advertisement -

సామాజిక బాధ్యతతో టీ న్యూస్ చేపడుతున్న ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌ని అందరు ఉపయోగించుకోవాలని సూచించారు నిజామాబాద్ ఎంపీ కవిత. నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌ని ఎంపీ సంతోష్, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డితో కలిసి ప్రారంభించిన అనంతరం మాట్లాడిన కవిత…టీ న్యూస్ పుట్టిందే తెలంగాణ కోసం అని తెలిపింది. తెలంగాణ ప్రజలకు ఉపయోగపడాల్సిన విషయాలను అందించేందుకు టీ న్యూస్‌ ముందుకు వచ్చిందన్నారు. విద్యార్థుల సందేహాలు తీర్చిదిద్దే విధంగా,వారి తల్లిదండ్రుల ఆందోళనను నివృత్తి చేసేవిధంగా టీ న్యూస్ చేపట్టిన ఈ ఎడ్యుకేషన్‌ ఫెయిర్ అభినందనీయమని తెలిపారు.

ప్రతి విద్యార్ధి,కాలేజీల సమాచారం తెలుసుకొని చేరాలని సూచించారు కవిత. ఎడ్యుకేషన్ ఫెయిర్‌ను అందరు ఉపయోగించుకోవాలని తెలిపిన కవిత…విద్యార్ధుల భవిష్యత్ బాగుండలన్నదే టీఆర్ఎస్ ప్రభుత్వ అభిమతమన్నారు. ఇంజనీరింగ్ విద్యను మెరుగుపర్చేందుకు..విద్యార్థుల్లో స్కిల్స్‌ను పెంచేలా చర్యలు చేపట్టామని తెలిపారు.

తెలంగాణలో ఉన్న 164 కాలేజీల్లో చదువుతున్న 88 వేల మంది విద్యార్థులు మంచి నైపుణ్యంతో బయటకు వస్తారని తెలిపారు. సంవత్సరంలో ఒకసారి విద్యార్ధుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించాలని సూచించింది ఎంపీ కవిత. తెలంగాణ గౌరవాన్ని పెంచేలా విద్యాసంస్థలు కృషిచేయాలని ఆకాంక్షించారు కవిత.

- Advertisement -