- Advertisement -
ఎన్నారై టి. ఆర్. యస్ సెల్ – యూకే అధికారిక 2017 క్యాలెండర్ ని టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ లో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా సంస్థ చేస్తున్న కార్యక్రమాల గురించి ప్రతినిధులు ఎంపీ కవితకి వివరించారు. పార్టీ నాయకత్వం అన్ని సందర్భాల్లో మీ వెంట ఉంటుందని క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా నడుచుకొని కేసిఆర్ నాయకత్వాన్ని బలపరచాలని సూచించారు. క్యాలెండర్ ఆవిష్కరంచడమే కాకుండా అన్ని సందర్భాల్లో వెంట ఉండి ప్రోత్సహిస్తున్న కవితకి ఎన్నారై టీఆర్ఎస్ నాయకులు కృతఙ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో ఎన్నారై టీఆర్ఎస్ నాయకులు రాకేష్ రెడ్డి కీసర, రాజ్ కుమార్ శానబోయిన, మల్లేష్ పప్పుల, సుభాష్ కుమార్ మరియు టాక్ ప్రతినిధి సాయి నర్రా తదితరులు ఉన్నారు.
- Advertisement -