నేతన్నల కోసమే… బతుకమ్మ చీరల పంపిణీ

245
Mp kavitha at Bathukamma sarees distribution
- Advertisement -

బతుకమ్మ పండుగ నేపథ్యంలో కోటి 4 లక్షల చీరలను పంపిణీ చేస్తున్నామని స్పష్టం చేశారు ఎంపీ కవిత. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన చీరల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడిన కవిత మహిళలకు బతుకమ్మ శుభాకంక్షలు తెలిపారు.

Mp kavitha at Bathukamma sarees distribution
నిజామాబాద్ జిల్లాలో 5 లక్షల 13 వేల చీరలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ అన్నగా సీఎం కేసీఆర్.. ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు పంపారని పేర్కొన్నారు. బతుకమ్మ, బోనాల పండుగను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. పేదల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని కవిత ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు భూపతి రెడ్డి, వీజీ గౌడ్, మేయర్ ఆకుల సుజాతతో పాటు పలువురు పాల్గొన్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్‌లో ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. నేతన్నల కోసమే… బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ఈ సందర్భంగా ఎల్లవ్వ అనే మహిళకు కేటీఆర్ చీర అందజేశారు. పుట్టించి నుంచి వచ్చిన చీరగా భావిస్తున్నానని చెబుతూ.. ఎల్లవ్వ సంతోషం వ్యక్తం చేశారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా సీఎం కేసీఆర్.. మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నారని తెలిపారు. పేదవాడి ఆత్మగౌరవంతో పాటు నేతన్నలకు పని కల్పించేందుకు ద్విముఖ వ్యూహంతో ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు.

- Advertisement -