టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రత్యక్ష రాజకీయాల నుండి తప్పుకుంటున్నానని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు. మీడియాతో మాట్లాడిన ఆయన ఇక నుండి పూర్తిస్థాయిలో వ్యాపారాలపై దృష్టిసారించనున్నట్లు తెలిపారు. తనకు ఇంతకాలం సహకరించిన గుంటూరు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని,ఒకవేళ ఆ తర్వాత అవకాశం వస్తే తిరిగి పోటీ చేసే విషయంపై ఆలోచిస్తానని తెలిపారు.
ఎంపీగా రాష్ట్రంలో పలు సమస్యలపై, ప్రత్యేక హోదా విషయంపై, రాజధాని అంశంపై గళమెత్తానని తెలిపారు. సీబీఐ, ఈడీ నా ఫోన్ లు ట్యాప్ చేస్తున్నాయని తెలిపారు. రాజకీయాల్లో నా పని పూర్తిగా నిర్వర్తించలేక పోతున్నానని, ప్రజల్లో ఎక్కువ సమయం ఉండలేక పోతున్నానని చెప్పారు. పార్లమెంట్ లో మౌనంగా కూర్చోవడం నావల్ల కాదని అందుకు తప్పుకుంటున్నానని తెలిపారు. రాజకీయం, వ్యాపారం రెండు చోట్ల ఉండలేను అందుకే రాజకీయాల నుండి తప్పుకున్నానని చెప్పుకొచ్చారు. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు గెలుపొందారు గల్లా.
Also Read:నితీష్ ప్లానేంటి.. కూటమిలో రగడ?