203 జీఓను ఏపీ వెనక్కి తీసుకోవాలి: ఎంపీ బడుగుల

872
MP Badugula Lingaiah Yadav On AP Govt

ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన 203 జీఓపై సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్,హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ.. అక్రమంగా నీటిని ఆంధ్ర ప్రభుత్వం తరలించుకు పోతుంటే తెలంగాణ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. సీఎం కేసీఆర్ ఉండగా ఏపీ ప్రభుత్వ పప్పులు ఊడకవు అన్నారు. 203 జీఓను ఏపీ ప్రభుత్వం వెనుకకు తీసుకోవాలి. కాంగ్రెస్, బీజేపీలు దొంగ నాటకాలు అపి చిత్తశుద్ధితో ముందుకురావాలని తెలిపారు.

ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ..ఆంధ్ర ప్రభుత్వము ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. స్నేహ హస్తం అందిస్తే జగన్ కుట్రతో తెలంగాణకు అన్యాయం చేయాలని చూస్తున్నాడు. అక్రమంగా చుక్క నీటిని కూడా ఆంధ్రకు పోనివ్వం. కృష్ణా ట్రిబ్యునల్ చెప్పినవిధంగా ఆంధ్ర ప్రభుత్వం నడుచుకోవాలి అన్నారు.