బయటపడ్డ ప్రేమ పావురాలు

147
- Advertisement -

అవును, తాజాగా మూడు ప్రేమ పావురాల జంటలు బయట పడ్డాయి. తమ రహస్య ప్రేమ లోకంలో నుంచి ఈ భౌతిక లోకంలోకి వచ్చాయి. పైగా మూడు జంటలు తమ బంధాన్ని బలపర్చుకున్నాయి. అందులో మొదటి జంట గురించి తెలుసుకుందాం. ‘గాడ్సే’ , ‘అమ్ము’ చిత్రాలతో తెలుగు వారికి దగ్గరైన మలయాళీ భామ ఐశ్వర్య లక్ష్మి. తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. తమిళ నటుడు అర్జున్‌ దాస్‌తో తాను రిలేషన్‌లో ఉన్నట్లు చెప్తూ.. అర్జున్‌తో దిగిన ఓ ఫొటోకు లవ్‌ సింబల్‌ను ట్యాగ్ చేసి ఇన్‌స్టాలో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో గురించే నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. పలువురు సెలబ్రిటీస్ కంగ్రాట్స్ తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక రెండో జంట విషయానికి వస్తే.. టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టిల పెళ్లి డేట్ ఫిక్సయింది. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరి పెళ్లికి ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ నెల 23న వీరిద్దరు వివాహ బంధంతో ఒక్క‌టికానున్నారు. ఈ నెల 21వ తేదీ నుంచి 23 వరకు వివాహ వేడుకలు జరగనున్నట్టు తెలుస్తోంది.

చివరగా మూడో జంట విషయానికి వస్తే.. బిగ్ బాస్ బ్యూటీ రాఖీ సావంత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ముద్దగుమ్మ వరుస అవకాశాల్ని అందుకుంటూ.. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్డేట్ ని షేర్ చేస్తుంటుంది. తాజగా ఈ అమ్మడు తన ప్రియుడు అదిల్ దురానిని సీక్రెట్ గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. దీనికి సంబంధించిన ఫొటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసేసరికి అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. మొత్తమ్మీద మూడు ప్రేమ పావురాల జంటలు తమ బంధాన్ని ఆ రకంగా బయట పెట్టేశాయ్.

ఇవి కూడా చదవండి…

సంక్రాంతి సినిమాలకు ఎంత పెంచారు?

పిక్ టాక్ : ఎరుపు అందాలండోయ్ !

హోరెత్తిన అభిమానం.. వీర ఓటీటీ అదే!

- Advertisement -