మానవత్వం మరిచిన ఓ కన్న తల్లి తన బిడ్డను ఉస్మానియా ఆస్పత్రిలోని ఏఎంసి వార్డులో వదిలేసి బయటకు వెళ్లి పోయిన ఘటన నగర పరిధిలో జరిగింది. నగరానికి చెందిన కీర్తన తన బిడ్డను వైద్య చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి అర్ధరాత్రి ఏడు గంటల 10 నిమిషాలకు తీసుకువచ్చింది. మొదట పాపకు ప్రాథమిక చికిత్స నిర్వహించిన తర్వాత తదుపరి మెరుగైన చికిత్స కోసం వైద్యులు వార్డుకు తరలించారు.
వార్డుకు చేరిన కొద్దిసేపటి తర్వాత తల్లి గీతం ఆ పాపను బెడ్ పైన వదిలేసి బయటకు వెళ్లి వస్తానని పక్కనున్న వాడు వారికి చెప్పి బయటికి వెళ్లి పోయింది. నిద్ర నుంచి మేల్కొన్న పసిపాప తన తల్లి కోసం ఏడవడంతో ఆమె కోసం ఆసుపత్రి సిబ్బంది అంతా వెతికినా ప్రయోజనం లేకపోయింది. దీంతో ఆసుపత్రి పాలకవర్గం ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు వెంటనే కేసు నమోదు చేసుకొని తల్లి ఆచూకీ కోసం దర్యాప్తు చేపట్టారు. పాపకు ఉన్న జబ్బా లేదా ఆడపిల్ల అనేక కారణాలతో వదిలి వెళ్లిందా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో పాపకు వైద్యులు మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తున్నారు.