ఉదయాన్నే ఇవి తింటే ఎంత ప్రమాదమో..!

85
- Advertisement -

మనం ఆరోగ్యంగా ఉండడం లేదా ఉండకపోవడం అనేది మనం తినే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. మన శరీరానికి అవసరమైన రీతిలో పోషకాలు కలిగిన ఆహారం సరైన సమయంలో తింటే ఆరోగ్యం సవ్యంగా ఉంటుంది. అలా కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు.. ఏది పడితే అది తినడం వల్ల లేని అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్లే. కాబట్టి ఎలాంటి ఆహారం ఏ సమయంలో తీసుకోవాలి. ఎంత మోతాదులో తీసుకోవాలి అనే విషయాలపై కనీసపు అవగాహన కలిగి ఉండాలి. చాలమంది ఉదయం నిద్ర లేవగానే రకరకాల ఆహార పదార్థాలు తింటూ ఉంటారు. పడగడుపున ఏది పడితే అది తినడం వల్ల ఆ ప్రభావం రోజంతా మన ఆరోగ్యంపై గట్టిగానే పడుతుంది. కాబట్టి ఉదయం పడగడుపున తినకూడని ఆహార పదార్థాలు ఎంతో ఒకసారి తెలుసుకుందాం..!

మజ్జిగ
చాలమందికి ఉదయం పూట నిద్ర లేవగానే మజ్జిగ తాగే అలవాటు ఉంటుంది. ఇలా ఉదయాన్నే మజ్జిగ తాగడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. మజ్జిగలో లాక్టిక్ ఆమ్లం అధికంగా ఉంటుంది. అందువల్ల కాళీ కడుపుతో మజ్జిగ తీసుకుంటే ఎసిడిటీ పెరిగే ప్రమాదం ఉంది.

శీతల పానీయాలు
ఉదయం పూట శీతల పానీయాలు తాగడం కూడా మంచిది కాదట. శరబత్, థమ్సప్, ఐస్ క్రీమ్, చల్లటి జ్యూస్ లు వంటి పానీయాలు పడగడుపున తాగడం వల్ల గ్యాస్ సమస్యలు, ఉబ్బరం, పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతే కాకుండా జీర్ణ క్రియ కూడా మందగిస్తుందట. తద్వారా అజీర్తి, కడుపులో మంట వంటి సమస్యలు తలెత్తుతాయి.

Also Read:తులసితో ఆరోగ్య ప్రయోజనాలు

స్పైసీ ఫుడ్
స్పైసీ ఫుడ్ చాలమంది ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. కానీ ఉదయం పూట పడగడుపున స్పైసీ ఫుడ్ తినడం మంచిది కాదు. ఇలా తినడం వల్ల కడుపులో మంట పెరుగుతుంది. అజీర్తి సమస్య తలెత్తుతుంది. కొన్ని సందర్భల్లో వాంతులు కూడా జరిగే ప్రమాదం లేకపోలేదు. కాబట్టి వీలైనంత వరకు ఉదయాన్నే స్పైసీ ఫుడ్ కు దూరంగా ఉండాలి.

పచ్చి కూరగాయలు తినడం
కొంత మందికి పచ్చికూరగాయలు తినే అలవాటు ఉంటుంది. క్యాబేజీ, క్యారెట్, బీట్ రూట్, దొండకాయ, బెండకాయ.. వంటి కూరగాయలను పచ్చిగా కూడా తింటూ ఉంటారు. అయితే ఉదయం పూట పచ్చిగా తినడం వల్ల లేని అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్టే అని నిపుణులు చెబుతున్నారు. పచ్చి కూరగాయలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. మన శరీరంలో ఫైబర్ శాతం పెరిగితే జీర్ణ వ్యవస్థ మందగించడంతో పాటు అవయవాల పని తీరు కూడా మందగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

కాబట్టి చాలావరకు ఉదయం పూట వీటికి దూరంగా ఉండడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Also Read:మాంగోస్టిన్ పండుతో ఎన్ని ప్రయోజనాలో..!

- Advertisement -