మాంగోస్టిన్ పండుతో ఎన్ని ప్రయోజనాలో..!

56
- Advertisement -

కొన్ని రకాల పండ్లు వాటికున్న రూపం కరణంగానో లేదా రుచి కరణంగానో ప్రత్యేకతను సంతరించుకుంటాయి. అలాంటి ప్రత్యేకత కలిగిన ఫండ్లలో మాంగోస్టిన్ పండ్లు కూడా ఒకటి. రుచిలో పులుపు తీపి కలగలిపి ఉండే ఈ ఫలాలు మన దేశంలో చాలా అరుదుగా లభిస్తాయి. విదేశాల్లో ముఖ్యంగా ఆగ్నేయాసియా, థాయ్ లాండ్, వియత్నం.. శ్రీలంక వంటి దేశాలలో ఎక్కువగా లభిస్తాయి. ఈ పండు చూడడానికి వికరించిన పత్తికాయను పోలి ఉంటుంది. మాంగోస్టిన్ పండ్లలో మన శరీరానికి అవసరమయ్యే అన్నీ రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో కెలోరీల శాతం తక్కువగా ఉండి, విటమిన్లు, ఖనిజాలు మెండుగా ఉంటాయి..

కాబట్టి ఈ పండు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనలు కలుగుతాయి. ఇందులో ప్రధానంగా ఉండే ఫైబర్ జీవక్రియను మెరుగుపరుస్తుంది. శరీర బరువును తగ్గించడంలోనూ, రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలోనూ కీలక పాత్ర పోషిస్తుందని పలు పరిశోదనల్లో వెల్లడైంది. ఇక ఇందులో సి విటమిన్ అధికంగా ఉండడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మాంగోస్టిన్ పండ్లలో యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు అధికంగా ఉంటాయట. అందువల్ల క్యాన్సర్, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు, మెదడు సంబంధిత వ్యాధుల నివారణలో మాంగోస్టిన్ పండ్లు క్రియాశీలక పాత్ర పోషిస్తాయని అద్యయానాలు చెబుతున్నాయి.

చర్మ సంబంధిత వ్యాధులను దూరం చేయడంలో కూడా మాంగోస్టిన్ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ప్రభావవంతంగా పని చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మొటిమలు, చర్మంపై పొక్కుల నుంచి వచ్చే దురద, మంట వంటి సమస్యలు ఈ పండు తినడం ద్వారా దూరం అవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు ఈ పండు తప్పనిసరిగా తినాలట. ఎందుకంటే ఇందులో కెలోరీల శాతం తక్కువగా ఉంటుంది కాబట్టి చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి అవకాశాలు చాలా తక్కువ. కాబట్టి మనదేశంలో చాలా అరుదుగా లభించే ఈ పండ్లు.. ఒకవేళ దొరికితే ఏ మాత్రం వదలకుండా తప్పనిసరిగా తినాలని ఆహార నిపుణులు చెబుతున్నారు.

Also Read:ఈ అద్బుతమైన ఆరోగ్య చిట్కాలు..తెలుసా?

- Advertisement -