చల్లటి కబురు…నైరుతి వచ్చేసింది

271
Monsoon hits kerala
- Advertisement -

ఎండవేడిమితో అల్లాడుతున్న ప్రజలకు మరికొన్ని రోజుల్లో ఉపశమనం కలగనుంది. అనుకున్న దానికంటే మూడు రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి. మంగళవారం నైరుతి రుతుపవనాలు కేరళను తాకినట్లు వాతావరణ అధికారులు వెల్లడించారు. జూన్ 7న తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశించనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని తెలిసిన వాతావరణ శాఖ అధికారులు రుతుపవనాల రాకతో కేరళలో నేడు, లేదా రేపు భారీ వర్షాలు పడే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.

ఈ ఏడాది జూన్ -సెప్టెంబర్ మధ్య కాలంలో సాధారణ వర్షపాతం నమోదౌతుందని, అస్థిర పరిస్థితులేవీ లేనందున వర్షపాతానికి ఈ ఏడాది ఢోకా ఉండదని వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాలు రాష్ట్రాన్ని పలకరించే వరకు ఎండల తాకిడి తప్పదని వాతావరణ కేంద్రం తెలిపింది.

- Advertisement -