కాలాకు కావేరి సెగ… విడుదలకు బ్రేక్..!

186
No Kaala release in Karnataka

సూపర్ స్టార్ రజనీకాంత్‌ హీరోగా కబాలి ఫేమ్ పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కాలా’. రజినీకాంత్ అల్లుడు ధనుష్ సమర్పణలో ఉండర్‌బార్ ఫిల్మ్స్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్‌ 7న ప్రేక్షకుల ముందుకురానుంది. కబాలిలో కొత్త రజినీకాంత్ చూపించిన దర్శకుడు రంజిత్.. ఈ సినిమలో కూడా తలైవాను డిఫరెంట్‌గా చూపిస్తున్నారు. ఇప్పటికే సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న చిత్రయూనిట్ సెన్సార్ కార్యక్రమాలను సైతం పూర్తిచేసుకుని యు/ఎ సర్టిఫికెట్ పొందింది.

తమిళ్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంకాగా కర్నాటకలో మాత్రం చిక్కెదురైంది. కాలా సినిమాను ఆడనివ్వబోమని స్పష్టం చేశారు కర్నాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు సారా గోవింద్. కావేరి జల వివాదంలో తమిళనాడుకు అనుకూలంగా.. కర్నాటకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఆయన సినిమా విడుదల చేయవద్దని డిస్ట్రిబ్యూటర్లను కోరారు. కాలా విడుదలైతే అల్లర్లు జరిగే అవకాశం ఉందని తెలిపారు.

అయితే,ఇప్పటికే పెద్ద ఎత్తున చెల్లించి సినిమాను సొంతం చేసుకున్నారు డిస్ట్రిబ్యూటర్లు. దీంతో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సినిమాలు,రాజకీయాలు వేరువేరని రెండింటికీ మూడిపెట్టవద్దని
కోరుతున్నారు.