నేటి రోజుల్లో రోజుకో కొత్తరకం వ్యాధులు విజృంభిస్తున్నాయి. వాటిపై కనీసపు అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రస్తుతం దేశంలో మంకీ ఫీవర్ వేగంగా విజృంభిస్తోంది. ఇప్పటికే కర్నాటకలో 40కి పైగా కేసులు నమోదయ్యాయి. అందువల్ల ఈ వైరల్ ఫీవర్ పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. కోతులను కుట్టిన దోమలు గాని ఈగలు గాని ఏవైనా కీటకాలు గాని మనుషులను కుడితే మంకీ ఫీవర్ వస్తుంది. దీనిపై అవగాహన లేకపోవడం వల్ల చాలామంది ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ మంకీ ఫీవర్ ను నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ వ్యాధి లక్షణాలను గుర్తించి సరైన వైద్యం తీసుకోవాలని చెబుతున్నారు. ఈ మంకీ ఫీవర్ సంభవించిన వారిలో జ్వరం, తలనొప్పి, దగ్గు, విరేచనాలు, వాంతులు.. వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. .
వారం రోజుల కంటే ఎక్కువగా జ్వరం, ఎడతెరిపి లేకుండా తలనొప్పి, గొంతు నొప్పి.. వంటి లక్షణాలు మేజర్ గా కనిపిస్తాయి. ఇంకా వీటితో పాటు కండరాల నొప్పి, తిమ్మిర్లు, ముక్కులో రక్తస్రావం, వణుకు, వంటి లక్షణాలు కూడా మంకీ ఫీవర్ కు సంబంధించిన లక్షణాలే. ఈ లక్షణాలు కనిపించినప్పుడు వైద్యుడి సాయంతో వైద్యం పొందడంతో పాటు కొన్ని జాగ్రత్తలు కూడా తప్పకుండా పాటించాలి. ముఖ్యంగా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, అలాగే వ్యక్తిగత పరిశుభ్రత కూడా చాలా ముఖ్యం. ఇంకా ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం, నీరు ఎక్కువగా తాగడం, శరీరంపై ఈగలు, దోమలు వంటివి కుట్టకుండా జాగ్రత్త వహించడం చేయాలి. కాబట్టి ప్రస్తుతం దేశంలో మెల్లగా విజృంభిస్తున్న మంకీ ఫీవర్ పట్ల అప్రమత్తంగా ఉండడం ఎంతో ముఖ్యం అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
Also Read:మూడు ఫార్మాట్లలో నెంబర్ వన్ వీళ్ళే!