పాపం కాంగ్రెస్..మోడీ సానుభూతి!

12
- Advertisement -

కాంగ్రెస్ పై మోడీ సానుభూతి చూపిస్తున్నారా ? అంటే అవునని చెప్పక తప్పదు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా తాజాగా రాజ్యసభలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే ఈ సందేహాలు రాక మానవు. అయితే ఆయన నిజంగానే హస్తం పార్టీపై సానుభూతి చూపిస్తున్నారా ? లేదా సైకలాజికల్ గా కాంగ్రెస్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీస్తున్నారా ? అనేది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన అంశం. ఇంతకీ మోడీ ఏమన్నారంటే ‘ కాంగ్రెస్ కు ఈసారి ఎన్నికల్లో 40 సీట్లు కూడా రావని మమతా బెనర్జీ చెబుతున్నారని, కానీ తాను కాంగ్రెస్ కు 40 సీట్లు కంటే ఎక్కువే రావాలని కోరుకుంటున్నట్లు ” మోడీ వ్యాఖ్యానించారు. అయితే హస్తం పార్టీపై చేసిన ఈ వ్యాఖ్యలు వ్యంగ్యంగా మోడీ చెప్పినప్పటికీ.. అందులో రాజకీయ వ్యూహం ఉందనేది కొందరు రాజకీయ వాదులు చెబుతున్న మాట. .

ఈ మధ్య ఇండియా కూటమి నుంచి ఒక్కో పార్టీ బయటకు వస్తుండడంతో కూటమి తీవ్రంగా బలహీన పడుతోంది. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇప్పటికే బయటకు వచ్చారు. మమతా బెనర్జీ కూడా ఆల్ మోస్ట్ కూటమి నుంచి బయటకు వచ్చినట్టే. అయితే కూటమి నుంచి బయటకు వచ్చిన నేతలంతా కాంగ్రెస్ నే టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో కూటమిలో అసలు సమస్య కాంగ్రెస్ పార్టీనే అనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి ఇతర పార్టీల్లోకి చేరే ఆలోచనలో కొంతమంది నేతలు ఉన్నట్లు జాతీయ మీడియాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలా కాంగ్రెస్ కాళీ అవుతున్న విషయాన్ని సెటైరికల్ గా ప్రస్తావిస్తూ కనీసం 40 సీట్లు అయిన కాంగ్రెస్ పార్టీకి రావలనే విధంగా రాజ్యసభలో మోడీ వ్యాఖ్యానించారనేది కొందరు విశ్లేషకులు చెబుతున్న మాట. మరి కాంగ్రెస్ పై ప్రధాని మోడీ చూపిస్తున్నా సానుభూతిపై హస్తం నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Also Read:మూడు ఫార్మాట్లలో నెంబర్ వన్ వీళ్ళే!

- Advertisement -