GreenIndia:మొక్కలు నాటిన మంత్రి పువ్వాడ..

27
- Advertisement -

బీఆర్ఎస్ ఎంపీ సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా రాష్ట్ర రవాణా శాఖ పువ్వాడ అజయ్ కుమార్ జన్మదినోత్సవం సందర్భంగా మొక్కలు నాటారు. హైదరాబాద్‌లోని తన అధికారికనివాసంలో మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్ మొక్కలు నాటారు.

Also read: KTR:హైదరాబాద్ నగర జీవ వైవిద్య సూచీ విడుదల..

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ ప్రారంభించిన తెలంగాణకు హరితహరం కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని మంత్రి పిలుపునిచ్చారు.

Also read: గ్రాడ్యుయేషన్ పట్టాను అందుకున్న హిమాన్షు.. అభినందించిన సీఎం

తన పుట్టిన రోజు సందర్భంగా పార్టీ నాయకులు అభిమానులు శ్రేయోభిలాషులు మొక్కలు నాటి శుభాకాంక్షలు తెలియజేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మొక్కలు నాటాలని చెప్పిన ఎంపీ సంతోష్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -