UGC:ఇంగ్లీష్‌లో చదివిన తెలుగులో పరీక్షలు..

40
- Advertisement -

ఉన్నత విద్యాను ఇక నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదివి తెలుగు మీడియంలో పరీక్షలు రాసే వెసులుబాటును యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు విశ్వవిద్యాలయాలకు బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులు ఇంగ్లీష్ భాషలో కోర్సులను అభ్యసించినప్పటికీ.. వారు ఇక నుంచి తెలుగు మీడియంలో పరీక్షలు రాసేందుకు అనమతించాలని సూచించినట్టు యూజీసీ ఛైర్మన్ జగదీశ్ కుమార్ తెలిపారు.

Also read: GreenIndia:మొక్కలు నాటిన మంత్రి పువ్వాడ..

ఇంగ్లీష్ భాషలోని పాఠ్య పుస్తకాలను స్థానిక భాషల్లో తయారు చేయడం ఇతర భాషల నుంచి ప్రామాణిక పుస్తకాలను అనువదించడంతో పాటు బోధన అభ్యసన ప్రక్రియలో వాటి వినియోగాన్ని ప్రోత్సహించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు స్థానిక భాషల్లో పరీక్షలు రాసేవిలుగా పాఠ్యపుస్తకాలను అనువదించాలని సూచించింది. స్థానిక భాషల్లోనే బోధన-అభ్యసన ప్రక్రియ ఉపయోగించాలని యూనివర్సిటీలను కోరుతున్నట్టు ఓ ప్రకటనలో వెల్లడించింది.

Also read: Bharath : ప్రపంచ జనాభాలో మనమే టాప్‌..!

- Advertisement -