మోహన్ లాల్ తెరకెక్కిస్తున్న మహాభరతంలో కర్ణడు పాత్ర చేయాల్సిందిగా తనను అడిగారని కింగ్ నాగార్జున స్పష్టం చేశాడు. 2018లో ఈ సినిమా ప్రారంభం కాబోతుందని కానీ ఇందులో నటించేది ఇప్పుడే స్పష్టం చేయలేనన్నాడు. బర్త్ డే సందర్భంగా చిట్ చాట్‌లో మాట్లాడిన నాగ్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న రాజు గారి గది 2 ప్యాచ్ వర్క్ మినహా పూర్తైందని రీకార్డింగ్ జరుగుతోందని తెలిపారు. అనుకున్నది ఫర్ ఫెక్ట్‌గా తీయడంలో ఓంకార్‌ఖు మంచి పర్‌ఫెక్షన్ ఉందని తెలిపాడు. రాజుగారి గది సినిమాకి దాని సీక్వెల్‌కి సంబంధం లేదన్నారు నాగ్.
అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న రెండో సినిమా హలో చూడలేదని… విక్రమ్ చాలా ప్లాన్డ్‌గా,క్రియేటివ్‌గా సినిమాని బాగా తీస్తారని చెప్పుకొచ్చారు. మెయిన్‌గా హీరోయిన్ సెలక్షన్‌లోనే బాగా లేట్ అయింది. పియదర్శన్‌గారి అమ్మాయిని స్క్రీన్ టెస్ట్ చేసిన తర్వాత 30, 40 మందిని చేశాం. చేస్తూనే వున్నాం. అందుకే లేట్ అయింది. ఫ్రెష్‌గా వుండాలి అనుకున్నాం. గీతాంజలిలో గిరిజలా, ఏమాయ చేసావెలో సమంతలా కొత్తగా వుండాలనుకున్నాం. చివరికి ప్రియదర్శన్‌గారి అమ్మాయి కళ్యాణినే సెలెక్ట్ చేశామన్నారు.
హలో సినిమా కొంచెం కాంప్లికేటెడ్ అన్న నాగ్ బడ్జెట్ కూడా ఎక్కువవుతోందని తెలిపారు. ఇతర భాషల్లో సినిమాలో చేసే ఆలోచన ఉందా అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చిన నాగ్… ఇంతకుముందు నా సినిమాలు కూడా వేరే భాషల్లో రిలీజ్ అయ్యాయి. కానీ, రిజల్ట్ అంత బాగా రాలేదు. ఇక్కడ చేసిన తర్వాత వేరే భాషల గురించి ఆలోచిద్దామనుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు.
దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ బంగార్రాజుకు సంబంధించి ఒక లైన్ చెప్పాడు. అంతగా నచ్చలేదు. మళ్ళీ ప్రిపేర్ అయి మంచి కథ చెప్తే తప్పకుండా చేస్తాను. అయితే అది ‘సోగ్గాడే చిన్నినాయనా’కు సీక్వెల్ మాత్రం కాదని స్పష్టం చేశాడు.
అక్టోబర్ 6న పెళ్ళి. అందరికీ తెలిసిందే. ఒకేరోజు క్రిస్టియన్, హిందూ సంప్రదాయాల్లో పెళ్ళి చేస్తున్నాం. పెళ్ళి సింపుల్‌గా చెయ్యాలని వాళ్ళే అనుకున్నారు. ఆ తర్వాత రిసెప్షన్ గ్రాండ్‌గా చెయ్యాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిపాడు.