విజయ్ దేవరకొండ, షాలిని పాండే ప్రధాన పాత్రలలో అర్జున్ రెడ్డి అనే చిత్రం తెరకెక్కగా ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. విడుదలకి ముందు అనేక వివాదాలు ఈ చిత్రాన్ని చుట్టు ముట్టిన, చివరికి మంచి విజయం సాధించింది. వీకెండ్ లో హాఫ్ మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఈ చిత్రం చేరడం ఖాయమని అంటున్నారు. అయితే ఈ సినిమాలో దాదాపు 16 లిప్ లాక్ సీన్స్ ఉన్నాయని చెబుతున్నారు సినిమా చూసినవాళ్లంతా.
ఇక ఈ సినిమాలో అర్జున్ రెడ్డి లవర్ ప్రీతిగా నటించి మంచి మార్కులు కొట్టేసింది షాలిని పాండే. తన మొదటి సినిమాలో 16 ముద్దు సన్నివేశాలు ఉన్నాయని తెలిసి కూడా ఈ సినిమాకు ఒప్పుకుంది షాలిని. అర్జున్ రెడ్డిలో హీరోయిన్‌గా నటించిన షాలిని పాండే స్వంత ఊరు జబల్ పూర్.. మధ్యప్రదేశ్ రాష్ట్రం.. ఇంజనీరింగ్ చదివిన షాలినికి.. ఇంజనీరింగ్ కంటే నటనపైనే ఎక్కవ ఆసక్తిగా ఉండేదట. షాలిని తండ్రి మాత్రం తన కూతురిని మంచి ఇంజనీర్ గా చూడాలనుకునేవారు.
అందుకోసం అటు ఇంజనీరింగ్ చదువుతూనే, థియేటర్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుంది. కూతురి ఇంట్రెస్ట్ ని కాదనలేక ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అర్జున్ రెడ్డి సినిమాలో నటించానంటుంది షాలిని. గత ఏడాది సెట్ ఇండియా చానల్ లో వచ్చిన ‘ మన్ మే విశ్వాస్ హై’ టీవీ షో ఎపిసోడ్లలో నటించింది షాలిని. అలా అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దృష్టిలో పడ్డ షాలినికి హీరోయిన్‌గా తన సినిమాలో అవకాశం ఇచ్చారు. హీరోయిన్‌గా ఆడిషన్ కోసం షాలిని నటించిన ఓ వీడియో యూట్యూబ్‌లో హల్ చల్ చేస్తోంది. మీరు ఓ సారి వీడియో చూడండి..

