500 శతాబ్దాలుగా భారతీయులు ఎదురుచూస్తున్న కల నెరవేరింది. రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ రామ్ లల్లా విగ్రహాన్ని ప్రాణ ప్రతిష్ట చేయగా ఈ సందర్భంగా మాట్లాడిన ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్..500 ఏండ్ల తర్వాత మళ్లీ రామ్ లల్లా అయోధ్యకు తిరిగి వచ్చారని చెప్పారు.
రామ్ లల్లాకు అనన్యమైన మర్యాద ఇస్తున్నామని, ఈ యుగానికి చెందిన చరిత్రకు చాలా శక్తి ఉందని, రామ్ లల్లా కథలు విన్నవారు తమ బాధలు, సమస్యలు నుంచి విముక్తి పొందుతున్నారని తెలిపారు. రామ్‌లల్లాతో పాటు భారత స్వరం కూడా తిరిగివచ్చిందన్నారు.
అయోధ్యలో రామమందిరం ప్రాణప్రతిష్ఠ క్రతువు ముగిసిన తర్వాత ప్రధాని మోడీ తన ఉపవాస దీక్షను విరమించారు. రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట వేడుకకు 11 రోజుల ముందు అనుష్ఠాన దీక్ష చేపట్టారు మోడీ. దీక్షలో భాగంగా మోడీ కఠిన నియమాలు, మతపరమైన వ్యాయామాన్ని పాటించారు.
Also Read:Nagarjuna: నాగార్జున ఊపిరి పీల్చుకున్నట్టే