ఇండియాకు జాంటీ రోడ్స్ గా పేరుగాంచిన మొహమ్మద్ కైఫ్ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఫిల్డర్ అంటే మొదట గుర్తొచ్చేది సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ . అతని తర్వాత అంతగా క్యాచ్ లు పట్టి ఇండియన్ జాంటీరోడ్స్ గా పేరుతెచ్చుకున్నాడు కైఫ్. ఎంతటి క్యాచ్ నైనా డయ్ లు వేసి సులభంగా బంతిని పట్టుకోవడం కైఫ్ కు వెన్నతో పెట్టిన విద్య. తన క్రికెట్ చరిత్రలో ఎన్నో అద్బుతమైన క్యాచ్ లు పట్టి అభిమానులను అలరించాడు.
సుధీర్ఘ కాలం పాటు ఇండియా తరపున ప్రాతినిథ్యం వహించిన కైఫ్ నేడు అన్నీ ఫార్మట్ల క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కైఫ్ భారత్ తరపున చివరి సారి 12 క్రితం ఆడిన అనంతరం తన రిటైర్మెంట్ ను ప్రకటించాడు. లోయర్ ఆర్డర్ బ్యాటించ్ చేసి ఎన్నో సార్లు మ్యాచ్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. తన కెరీర్ లో 13 టెస్టులు, 125 వన్డేలకు కైఫ్ ప్రాతినధ్యం వహించాడు. 13 టెస్టుల్లో మొత్తం 624 పరుగులు చేయగా అందులో ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు చేశాడు. తన రిటైర్మెంట్ లేఖను బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా, తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరికి పంపించాడు.
ఈసందర్భంగా కైఫ్ తాను ఎందుకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నానో ట్వీట్టర్ ద్వారా తెలిపాడు. తాను చిన్నప్పుడు క్రికెట్ ఆడుతున్నప్పుడు ఒక్కసారైనా ఇండియా తరపున ఆడితే చాలని అనుకున్నానని.. కానీ తనకు టీంఇండియాలో చోటు రావడంతో చాలా సంతోషపడ్డానన్నారు. తన జీవితంలో ఇండియా తరపున 190రోజులు ఆట ఆడానని చెప్పుకొచ్చాడు. తాను క్రికెట్ నుంచి తప్పుకోవడానికి ఇదే సరైన రోజని భావిస్తున్నానని కైఫ్ తన ట్వీట్టర్ లో పేర్కొన్నాడు. ఈసందర్భంగా ఆయన రిటైర్మెంట్ చేస్తూ ఓ వీడియోను కూడా పోస్ట్ చేశాడు.
An apt day to make this announcement pic.twitter.com/F97vuKaoKA
— Mohammad Kaif (@MohammadKaif) July 13, 2018