బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా ఇవాళ భాద్యతలు స్వీకరించనున్నారు ఆర్థిక వేత్త మహమ్మద్ యూనస్. ఇవాళ దుబాయ్ నుండి ప్రత్యేక విమానంలో ఢాకాలోని హజ్రత్ షాజలాల్ అంతర్జాతయ విమానాశ్రయానికి చేరుకోనున్నారు యూనస్. అనంతరం బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్‌తో భేటీ అవుతారు.
ఇవాళ సాయంత్రం ప్రమాణస్వీకార కార్యక్రమం ఉండనుండగా కొత్తగా ఏర్పడే తాత్కాలిక ప్రభుత్వం 15 మంది సభ్యులతో ఉండే అవకాశం ఉంది. హింస మన శత్రువు… మరింత మంది శత్రువులను సృష్టించుకోవద్దు ప్రజలంతా ప్రశాంతంగా ఉండాలని, దేశాన్ని నడిపించడానికి సిద్ధంగా ఉండాలని ఇప్పటికే ప్రజలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన విద్యార్థుల ఆగ్రహావేశానికి గురైంది. చివరకు విద్యార్థుల ఆందోళన హింసాత్మకంగా మారి వందాలది మంచి చనిపోగా ఆ ఆదేశ ప్రధాని షేక్ హసినా చివరకు రాజీనామా చేసి దేశాన్ని విడిచిపెట్టి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
Also Read:భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కార్యాలయం ప్రారంభం