రైతుబంధును కాపీ కొట్టారు: ఎంపీ కవిత

255
kcr modi
- Advertisement -

రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది మోడీ సర్కార్‌. ప్రజా ఆకర్షక పథకాలకు పెద్దపీట వేసిన కేంద్రం..తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు బంధు తరహాలనే పీఎం కిసాన్ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ట్విట్టర్ ద్వారా స్పందించింది ఎంపీ కవిత.

సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్ని మోడీ కాపీ కొట్టారని తెలిపారు. అయితే అది సరిగా లేదని తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తి రైతుల‌కు పెట్టుబ‌డి సాయంగా ప్ర‌తి ఎక‌రాకు రెండు ద‌ఫాలా 5 వేలు ఇస్తోంద‌ని, కానీ కేంద్ర ప్ర‌భుత్వం త‌మ ప‌థ‌కంలో ఎక‌రాకు 6 వేలు కేటాయించిన‌ట్లు ట్వీట్ చేశారు. రైతు బంధు పథకాన్ని మోడీ మ‌రింత రిఫైన్ చేయాల్సిన‌ అవ‌స‌రం ఉంద‌న్నారు. క‌చ్చితంగా ఇది ఎల‌క్ష‌ణ్ బ‌డ్జెట్ అని అన్నారు.

కేంద్రం ప్ర‌క‌టించిన‌ రైతుబందు.. ఒక రైతుకు సంవత్సరానికి కేవలం 6 వేల రూపాయలు మాత్రమే చెల్లిస్తుంది. ఐదు ఎకరాలలోపు భూమి ఉన్న రైతులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. అది కూడా మూడు వాయిదాల్లో 2 వేల చొప్పున రైతు అకౌంట్లలో నేరుగా జమ చేస్తారు.

- Advertisement -